Mogali Puvvu : దాదాపు హిందువులంతా ప్రతి రోజూ పూజలు చేస్తుంటారు. ఉదయం, సాయంత్రం దేవుడికి పూలు సమర్పించి దీపారాధన చేస్తూ.. ఆ భగవంతుడిని స్మరిస్తుంటారు. అయితే మనకు తెల్సినంత వరకు దేవుడి పూజలో చాలా రకాల పూలను ఉపయోగిస్తుంటాం. కానీ పుష్పాలలో ఒకటైన మొగలి పువ్వును మాత్రం ఆ భగవంతుడి ఏ పూజలోను వాడరు. ఎందుకలా ఉపయోగించకూడదనే అనుమానం మనకు వచ్చి పెద్దలను అడిగితే.. వాడకూడదు అంతే అని చెబుతారు తప్ప సరైన సమాధానం ఉండదు. అయితే ఇందకు కారణం వారికి కూడా సమాధానం తెలియకపోవడమే. అయితే అసలు మొగలి పువ్వును పూజకు ఎందుకు వినియోగించరు అందుకు గల కారణం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మన పురాణాల ప్రకారం ఒకరనాడు… బ్రహ్మ దేవుడు, శ్రీ మహా విష్ణువు నేను గొప్పంటే నేను గొప్ప అని వాదించుకున్నారట. అయితే ఆ విషయం తెలుసుకున్న పరమ శివుడు వారిద్దరి కళ్లు తెరిపించాలనే ఉద్దేశంతో వారి మధ్య లింగ రూపంలో పుట్టాడు. నా శిరస్సు ఎక్కడుందో వెతికి తీసుకు రమ్మని బ్రహ్మ దేవుడికి తీసుకురమ్మన్నాడు. అదే విధంగా విష్ణుకు కూడా తన కాళ్లను వెతికి తీసుకురమ్మన్నాడు. అయితే శివుడి ఆజ్ఞ మేరకు బ్రహ్మ, విష్ణువులు ముల్లోకాలలో వెతికినప్పటికీ వారికి శివుడి తల, పాదాలు దొరకలేదు. ఇంక చేసేదేం లేక శివుడి వద్దకు వచ్చి ఇదే విషయాన్ని వివరించారు. కానీ బ్రహ్మ దేవుడు మాత్రం ఎలాగైనా సరే గెలవానుకుని తన వెంట ఒక ఆవును, మొగలి పువ్వును తీసుకువచ్చాడు.
లింగం తల చూశానని మొగలి పువ్వుతో అబద్ధపు సాక్ష్యం చెప్పించాడు. బ్రహ్మ ప్రలోభాలకు లోనయిన మొగలి పువ్వు లింగం తల చూసినట్లు అబద్ధపు సాక్ష్యం చెబుతుంది. అదే విధంగా కామ దేనువుని అడగగా… అది తన తోకను అడ్డంగా ఊపుతూ… అబద్దమని అసలు విషయాన్ని బయటపెట్టింది. అయితే తాను ఓడిపోయేందుకు బ్రహ్మ దేవుడితో కలిసి అబద్ధం చెప్పినందున మొగలి పువ్వును శ్రీ మహా విష్ణువు శపించాడు. ఇప్పటి నుంచి నీవు ఏ పూజకు పనికిరావంటూ శాపం పట్టాడు. అదే విధంగా కామ దేనువు తన తోకతో సత్యం చెప్పింది కాబట్టి… కామ ధేనువు వెనుక భాగం పూజార్హమగుగాక అని వరం ఇస్తాడు. అప్పటి నుంచి మొగలి పువ్వును ఎటువంటి పూజలో ఉపయోగించరు.
Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇల్లు మరియు కార్యాలయం సౌరశక్తిని కలిగి ఉండాలని, విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగంలో స్వావలంబన…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతులను నీడ గ్రహాలుగా చెబుతుంటారు.ఇక వీటిని ముఖ్య గ్రహాలుగా పరిగణించకపోయినప్పటికీ ఇవి ముఖ్య…
AP TRANSCO Jobs : విజయవాడలోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ పరిధిలో ఏపీ ట్రాన్ కో, ఏపీపీసీసీలో…
Karthika Masam : హిందూమతంలో పౌర్ణమి అమావాస్య వంటి వాటిని చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇక ప్రతి నెల అమావాస్య…
Groom Arrested : ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని షాపూర్ ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది. కాసేపట్లో వివాహం జరుగాల్సి ఉండగా పోలీసులు…
Vaibhav Suryavanshi : క్రికెట్‌లో ఐపీఎల్‌కి IPL 2024 ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ పుణ్యమా అని…
Meenakshi : సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మీనాక్షి చౌదరి. ఆ…
Akkineni Akhil Engagement : సమంత నుండి విడిపోయిన నాగ చైతన్య త్వరలో శోభితని వివాహం చేసుకోబోతున్నాడు. డిసెంబర్ 4న…
This website uses cookies.