Home » Devotional » Today Horoscope March 14 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : మార్చి 14 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 13, 2022, 10:40 pm
Advertisement

మేష రాశిఫలాలు : ముఖ్య విషయాలలో పెద్దల సలహాలు తీసుకోండి. అన్ని పనులు వేగంగా పూర్తిచేస్తారు. చక్కటి ఆశించిన ఫలితాలు సాధిస్తారు. మహిళలకు లాభాలు. శివాభిషేకం చేయించండి. వృషభరాశి ఫలాలు : శారీరక శ్రమ పెరుగుతుంది. మీరు కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు. అనుకున్న లక్ష్యాలను ఈరోజు చేరుకుంటారు. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలకు సానుకూల ఫలితాలు. ఇష్టదేవతారాధన చేయండి.

Advertisement

మిధున రాశి ఫలాలు : శుభదినం. అన్నింటా విజయం. పెద్దల వల్ల ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో మార్పులు. మహిళలకు లాభాలు. శివాష్టోతరం చదువుకోండి. కర్కాటకరాశి ఫలాలు : బాగా కష్టపడి పనిచేయాల్సిన రోజు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఎవరితో వివాదాలకు వెళ్లకండి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. మహిళలకు చికాకులు. శ్రీ కాలభైరావాష్టకం చదవండి.

Today Horoscope march 14 2022 check your zodiac signs

Advertisement

సింహ రా ఫలాలు : విజయాలను సాధిస్తారు. ఆటంకాలను అధిగమించి ముందుకుపోతారు. మంచి రోజుల్లో ఇది ఒకరోజు. ఇంట్లో, బయటా శుభ ఫలితాలు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. మహిళలకు సంతోషకరమైన రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

కన్యరాశిఫలాలు : అన్ని రకాల వృత్తుల వారికి సానుకూల ఫలితాలు. అప్పుల బాధలు తీరుతాయి. వ్యాపారాలలో లాభాలు కనిపిస్తున్నాయి. మంచి వార్తలు వింటారు. స్త్రీలకు అనుకోని లాభాలు వస్తాయి.

Advertisement

తులరాశి ఫలాలు : ధైర్యంతో ముందుకు పోతారు. అన్ని వృత్తుల వారికి కష్టంతో మంచి ఫలితాలు వచ్చే రోజు. బంధువులతో ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా మంచిరోజు. మహాకాళీ ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : అన్నింటా విజయం. సంతోషంతో ముందుకుపోతారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. బంధువులతో విబేధాలు. మానసిక ఆశాంతి. మహిళలకు అనారోగ్య సూచన. అమ్మవారి ఆరాధన చేయండి.

ధనస్సురాశి ఫలాలు : విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా చక్కటి పలితాలు వస్తాయి. అప్పుల బాధల నుంచి విముక్తి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. మంచి వార్తలు వింటారు. శివ స్తోత్రం పారాయణం చేయండి.

మకరరాశి ఫలాలు : శుభవార్తలు వింటారు. దూర ప్రాంత బంధవులు లేదా మిత్రుల ద్వారా ఈ వార్తలు వింటారు. ఆర్థికంగా పురోగతి. అన్ని పనులు పూర్తిచేస్తారు. చక్కటి ఆహారం, విశ్రాంతి లభిస్తాయి. శ్రీ రుద్రాభిషేకం చేయించండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందికరమైన రోజు. పనులలో జాప్యం కనిపిస్తుంది. బంధువుల ద్వారా లాభాలు పొందుతారు. సోదర వర్గం ద్వారా మనస్తాపం చెందుతారు. రుణాల కోసం ప్రయత్నం చేస్తారు. లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : చక్కటి ఫలితాలు పొందుతారు. అప్పుల బాధల నుంచి విముక్తి. పాత బకాయిలు వసూలు అవుతాయి. శారీరక శ్రమ పెరిగినా విజయాలను సాధిస్తారు. మంచి వార్తలు వింటారు. ఇష్టదేవతరాధన చేయండి.
శ్రీ దుర్గాదేవి దగ్గర నిమ్మకాయ దీపం పెట్టండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి