Temple : ఇంట్లోనే దేవుడు ఉండగా.. మళ్లీ గుడికి ఎందుకు వెళ్లాలి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Temple : ఇంట్లోనే దేవుడు ఉండగా.. మళ్లీ గుడికి ఎందుకు వెళ్లాలి?

 Authored By pavan | The Telugu News | Updated on :23 February 2022,7:30 pm

Temple : దేవుడు.. ఈ పేరు వినగానే మనకు దేవాలయాలే గుర్తుకు వస్తాయి. ఏ చిన్న పండుగ వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మనం ముందుగా వెళ్లేది గుడికే. ఎందుకుంటే నకు దేవుడి మీద అంత నమ్మకం.. కేవలం నమ్మకమే కాదండోయ్ భక్తి కూడా. అయితే దేవుడి మీద నమ్మకం ఉన్న ప్రతీ ఒక్కరి ఇంట్లో దేవుడి గది ఉంటుంది. ప్రత్యేకంగా గది ఏం లేకపోయినా దేవుడి విగ్రహమో, పటమో పెట్టుకుని పూజిస్తుంటారు. అయినప్పటికీ.. ఏదైనా పండుగ రాగానే ఆలయానకి పరుగులు పెడతారు. అసలు ఇంట్లనే దేవుడు ఉండగా మళ్లీ గుడులకు ఎందుకు వెళ్తారనే ఆలోచన మీకెప్పుడైనా వచ్చిందా. అసలు గుడికి ఎందుకు వెళ్తారు? వెళ్తే ఏం వస్తుంది।? అని అడిగితే… చాలా మంది పుణ్యం వస్తుందని చెబుతారు. లేదా స్వామి వారి కటాక్షం పొంది సమస్యలు తొలగిపోతాయని.. మరి కొందరు మానసిక ప్రశాంతత దొరుకుందని చెబుతారు.

అయితే అసలు గుడికి ఎందుకు వెళ్లాలో.. వెళ్తేం ఏం వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.అయితే మనం గుడికి వెళ్లగానే ముందుగా ప్రదక్షిణలు చేస్తాం. అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయంట. ఆలయంలోని విగ్రహం చుట్టూ తిరుగు తున్నప్పుడు.. అంటే ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు గర్భ గుడి నుండి వెలువడే కిరణం యొక్క అయస్కాంత తరంగాలను శరీరం గ్రహిస్తుందట. ఇలా శరీరంలోకి వెళ్లిన అయస్కాంత తరంగాలు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయని సైన్స్ చెబుతోంది. అంతే కాదండోయ్ గర్భ గుడి మూడు వైపులా మూసి ఉంచడం వల్ల అన్ని శక్తుల ప్రభావం పెరుగుతుందట. ఇక దీపం వెలిగించడం, గంటలు కొట్టడం, ప్రార్థనల చేయడం, ప్రసాదాలు తీసుకోవడం వాటి వల్ల ఆధ్యాత్మిక అనుభూతి పెరుగుతుందట.

what is the Reason behind people going to temple

what is the Reason behind people going to temple

అదనంగా, పువ్వుల, అగరు బత్తీలు వాసనలు మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తాయంట. అంతే కాకుండా మండే కర్పూరం దాని చుట్టూ రసాయన శక్తిని వ్యాపింపజేస్తుంది. ఆలయ గంటలు గర్భ గుడిలోని ఒక మూలలో ప్రకంపనలను సృష్టిస్తుందట. ఇది శక్తిని శాంత పరచకుండా ఉంటుంది. అలాగే ధూపం మరియు అరోమా థెరపీ వాతావరణంలో స్థిర శక్తిని ఉత్తేజపరిచే శక్తిని కలిగి ఉంటాయి. అయితే గుడిలో ఇచ్చే తీర్థంలో… కేవలం నీరు మాత్రమే కాకుండా తులసీ దళం, కర్పూరం, లవంగం, కుంకుమ పువ్వు, ఏలకులు వంటి ఉంటాయి. వీటి వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇలా గుడికి వెళ్తే ఎన్నో లాభాలు కల్గుతాయి. కాబట్టి అందరూ గుడికి వెళ్తుంటారు. ఈ కారణాలు ఎవరికీ తెలియకపోయినప్పటికీ.. మన పూర్వీకులు వెళ్లడంతో మనం కూడా వెళ్తుంటాం.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది