పుట్టు వెంట్రుకలు తీయడం వెనుక పరమార్థం ఏమిటో తెలుసా?
హిందూ సంప్రదాయాల ప్రకారం మనకు ఎన్నో ఆచర వ్యవహారాలు ఉన్నాయి. మనం చేసే ప్రతీ వెనుక ఓ పరమార్థం ఉంటుంది. అయితే మనం చేసే చాలా పనుల వెనుక సైన్స్ కూడా దాగి ఉంటుంది. అయితే మనిషి తల్లి గర్భంలో జీవం పోసుకున్నప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎన్నో జరుపుతారు. ఉదాహరణకు బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు సీమంతం.. బిడ్డ పుట్టాక పురుడు, బారసాల, అన్నప్రాశన, పుట్టు వెంట్రకలు తీయడం ఇలా బాల్యంలో ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అయితే వీటన్నిటి వెనుక పరమార్థం ఉంటుంది. అందుకు కారణాలు మనకు తెలియకపోయినప్పటికీ… అది మన ఆచారం అనుకుంటు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తుంటాం.అయితే ముఖ్యంగా మనం చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీస్తూ ఉంటూం.
అందుకు కారణం కూడా మనకు సరిగ్గా తెలియదు. కానీ మనకు ఇంటి దేవుడు లేదా ఇష్టమైన దేవుడికి ఆ వెంట్రుకలు సమర్పిస్తాం. అయితే ఇలా పిల్లల వెంట్రుకలను దేవుడికి ఇవ్వడం వెనుక గల కారణం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా దేవుడికి తల నీలాలు ఇవ్వడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. పురాణాల ప్రకారం మన తల వెంట్రుకలు పాపాలకు నిలయం అంట. అయితే ఆ వెంట్రుకలను వెంట్రుకలను ఆ భగవంతుడికి సమర్పించడం వల్ల మన పాపాలు దేవుని సన్నిధిలో తొలిగించినట్లు అవుతుంది. అయితే శిశువు జన్మించినప్పుడు మొదటగా తన తలను నేలకు ఆన్చి బయటకు వస్తాడు. అంటే పుట్టేటప్పుడు ముందుగా తల వచ్చి నేలను తాకుతుంది. అయితే ఆ శిశువు తల వెంట్రుకకు గత జన్మ పాపాలు అంటుకొని ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి.
అందుకోసమే పుట్టిన బిడ్డకు చిన్నతనంలోనే పుట్టు వెంట్రుకలు తీయించి ఆ పాపాలను తొలగించేస్తారు.సాధారణంగా పుట్టు వెంట్రుకలను చాలా మంది ఏడాదిలోపే తీస్తారు. అంటే కొందరు ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు నెలల్లో తీసారు. అలా కుదరని వాళ్లు మూడేళ్లకు లేదా ఐధేళ్లకు తీస్తారు. అంతే కాకుండా పుట్టు వెంట్రుకలు తీయించేందుకు సరైన ముహూర్తం కూడా చూసుకుంటారు. ముందుగా మేనమామతో ఐదు కత్తెర్ల వెంట్రుకలు తీయించి… అంటే కట్ చేయించిన తర్వాత గుండు కొట్టిస్తారు. ఇలా సరైన ముహూర్తంలో పుట్టు వెంట్రుకలు తీయడం ద్వారా గతజన్మ పాప ప్రక్షాళనతో పాటు మంచి జ్ఞానార్జన సంపాదించవచ్చట.