Navaratri : నవరాత్రుల టైంలో ఏమి చేయాలి.? ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసా… మీకోసం ఈ సమాచారం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Navaratri : నవరాత్రుల టైంలో ఏమి చేయాలి.? ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసా… మీకోసం ఈ సమాచారం…

 Authored By aruna | The Telugu News | Updated on :23 September 2022,6:00 am

Navaratri : దేశ వ్యాప్తంగా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ దసరా. ఈ పండుగ ఇంకొక ఐదు రోజులలో మొదలుకానున్నది.. ఇక ఈ పండుగని తొమ్మిది రోజులు పలువురు ఉపవాసాలు ఉంటారు. కనకదుర్గమ్మ కు ఈ పండుగ అంటే చాలా ఇష్టం. కావున నవరాత్రుల తొమ్మిది రోజులు ఎంతో నియమాలు పాటిస్తూ ఉంటారు భక్తులు. అదేవిధంగా 9 రోజుల వేడుకలను ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. అదేవిధంగా ఎంతోమంది నిష్టగా ఉపవాసం కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ తొమ్మిది రోజులు పిల్లలు, పెద్దలు బతుకమ్మలను పేర్చి ఆడుతూ పాడుతూ సందడి చేస్తూ ఉంటారు. అయితే ఇటువంటి సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. తర్వాత వారు చేసిన పొరపాట్లు తెలుసుకొని బాధపడుతూ ఉంటారు.

అయితే అసలు నవరాత్రుల టైంలో ఏం చేయాలి.? ఏం చేయకూడదు.. ఇప్పుడు మనం తెలుసుకుందాం… అమ్మవారిని ఆరాధించేవారుకి ఇష్టమైన పండుగ ఈ దసరా. ఈ ఏడాది శరత్ నవరాత్రులు 26 నుండి మొదలుకానున్నాయి. విజయదశమి అక్టోబర్ 5న, దుర్గ నిమజ్జనంతో ఈ పండగ అయిపోతుంది. ఈ పండుగకు ఎటువంటి నియమాలు పాటించాలి.. ఎటువంటి పొరపాటు చేయకూడదు చూద్దాం… అమ్మవారికి అఖండ జ్యోతిని వెలిగిస్తే ఆ దీపాన్ని నైరుతి దిశలో పెట్టాలి. అఖండ జ్యోతిని వెలిగించక లేకపోతే నైట్ అంతా ఉండేలా ఒక దీపాన్ని ఏర్పాటు చేసుకొని వెలిగించడం శ్రేయస్కరం. నవరాత్రుల టైంలో ఉపవాసం నుండి భక్తులు సహజంగా శుద్ధిచేసిన ఉప్పు కాకుండా రాక్ సాల్ట్ ను తీసుకోవాలి.

What to do during Navaratri Do not make any mistakes this information is for you

What to do during Navaratri ? Do not make any mistakes, this information is for you…

ఉపవాసం టైం లో పొగాకు, మద్యం తీసుకోకూడదు. ఈ తొమ్మిది నవరాత్రుల టైం లో ఉల్లిపాయలు, వెల్లుల్లి అస్సలు ముట్టవద్దు…నవరాత్రి అనేది ఆధ్యాత్మిక అవగాహన క్రియ క్రమశిక్షణ, శియ నియంత్రణ, శియ సాక్షాత్కరం పక్క అవసరం. అందుకే తపస్సు చేయడం చాలా ముఖ్యం. ఈ తొమ్మిది రోజులు ఎంతో నిష్టగా ఉంటూ తపస్సు చేసుకోవాలి. నవరాత్రి వేడుకలు సందర్భంగా అమ్మవారిని తొమ్మిది రూపాయలలో ఆరాధిస్తారు. కావున ఈ పండగ టైంలో చుట్టూ ఉన్న మహిళలను గౌరవించాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది