Shani Jayanti : శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి.. శని జయంతి ప్రత్యేకం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shani Jayanti : శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి.. శని జయంతి ప్రత్యేకం

Shani Jayanti : దేవతల్లో శనీశ్వరుడి స్థానం ప్రత్యేకమైనది. సనాతన ధర్మంలో దేవాతారాధన ఎంతో ముఖ్యమైనది అన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. దేవదేవతలు అనుగ్రహం పొందేందుకు వివిధ రకాల పూజలు చేస్తుంటారు. జీవితంలో మంచి జరగాలని కోరుకుంటూ దేవతారాధన చేస్తుంటారు. మనశ్శాంతి కోసం గుళ్లకు వెళ్లి దేవుళ్లను పూజిస్తారు. అయితే.. దేవతల్లో కెల్లా శనీశ్వరుడి స్థానం ప్రత్యేకమైనది. ఎందుకంటే శని అనగానే మనలో చాలా మందికి గుర్తుకు వచ్చేది చెడు. జీవితం అల్లకల్లోలంగా సాగుతుంటే […]

 Authored By pavan | The Telugu News | Updated on :24 May 2022,7:00 am

Shani Jayanti : దేవతల్లో శనీశ్వరుడి స్థానం ప్రత్యేకమైనది. సనాతన ధర్మంలో దేవాతారాధన ఎంతో ముఖ్యమైనది అన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. దేవదేవతలు అనుగ్రహం పొందేందుకు వివిధ రకాల పూజలు చేస్తుంటారు. జీవితంలో మంచి జరగాలని కోరుకుంటూ దేవతారాధన చేస్తుంటారు. మనశ్శాంతి కోసం గుళ్లకు వెళ్లి దేవుళ్లను పూజిస్తారు. అయితే.. దేవతల్లో కెల్లా శనీశ్వరుడి స్థానం ప్రత్యేకమైనది. ఎందుకంటే శని అనగానే మనలో చాలా మందికి గుర్తుకు వచ్చేది చెడు. జీవితం అల్లకల్లోలంగా సాగుతుంటే శని ప్రభావం ఉందని భావిస్తాం. కష్టాలు, నష్టాలు చుట్టుముడితే శని దాపురించిందని మదన పడి పోతుంటాం. ఇలా శనీశ్వరుడికి కోపం వస్తే.. మన జీవితంలో శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి.శని అనుగ్రహం కోసం రకరకాల పూజలు చేస్తుంటారు చాలా మంది.

జీవితంలో వచ్చిన సమస్యలు తొలగిపోవాలని, కష్టాలు, నష్టాలు వదిలి వెళ్లి పోవాలని.. జీవితం సాఫీగా ఆనందంగా గడపాలని శనీశ్వరుడిని ఆరాధిస్తారు. శనీశ్వరుడికి ఇష్టమైన రోజున, పూజలతో పాటు నలుపు వస్తువులను దానం చేస్తారా చాలా మంది. హిందూ మత సాంప్రదాయంలో ధాన ధర్మాలకు ప్రత్యేక స్థానం ఉంది. దానం చేసే వారిని శని దేవుడి అత్యంత ప్రియమైన వారిగా భావిస్తాడని నమ్మకం ఉంది.శనీశ్వరుడి అనుగ్రహం కోసం ఏమేం చేయాలి.. శనీ జయంతి రోజున ఏ పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాదిలో శని జయంతి ఈ నెలలోనే వస్తోంది. మే 30వ తారీఖున సోమవారం శని జయంతి వస్తుంది. మే 29 ఆదివారం పగటి పూట 2 గంటల 54 నిమిషాలకు శని జయంతి ప్రారంభం కానుంది. మే 30వ తేదీన సాయంత్రం 4 గంటల 59 నిమిషాల వరకు ఉంటుంది. ఈసారి ఉదయమే తిథి రావడంతో మే 30న శని జయంతి జరుపుకోనున్నారు.

what to do to please saturn shani jayanti is special

what to do to please saturn shani jayanti is special

శని దేవుని అనుగ్రహం పొందడానికి ఈ రోజు చాలా పవిత్ర మైనదిగా భావిస్తారు.శని జయంతి రోజున ఈ పనులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. శని ప్రభావం మనపై ఉండకుండా ఉంటుంది. శని జయంతి రోజున తెల్లవారుజామునే తలస్నానం చేయాలి. ముందు ఆవాల నూనెతో మర్దన చేసి తలస్నానం చేయాలి. శని జయంతి రోజున శనీశ్వరుడికి ప్రతీ పాత్రమైన ప్రసాదాలు సమర్పించుకుంటే మంచిది. ఈ ప్రసాదాలను ఆవ నూనెతో మాత్రమే చేయాలి. ఉదయమే తలస్నానం చేసి ఆవ నూనెతో వంటకాలు సిద్ధం చేసుకోవాలి. ఆయా వంటకాలను శని పూజలో ప్రసాదాలుగా సమర్పించాలి. నల్ల నువ్వులు, ఆవ నూనె దీపం, ఇతర వస్తువులతో పూజను నిర్వహించాలి. ప్లేట్ తో గుడికి వెళ్లి శని దేవుడికి సమర్పించండి. ఆ రోజు శని చాలీసాను పఠించాలి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది