Home » Devotional » When Is Sankranti This Year January 14th 15th Scholars Clarification On This
Devotional

Sankranti 2026 Dates : ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు…? జనవరి 14 నా, 15 నా..? దీనిపై పండితుల స్పష్టత…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: January 10, 2026, 6:00 am
Advertisement

Sankranti 2026 Dates : తెలుగువారి పెద్ద పండుగలలో సంక్రాంతి పండుగ కూడా ఒకటి. ఎంతో ఘనంగా, పిండి వంటలతో,ముగిట రంగవల్లిలతో అందమైన ముగ్గులు అలంకరించబడతాయి. హరిదాసు కీర్తనలతో, డోలు, సన్నాయి బసవన్నతో సందడిగా ఉంటుంది. బందువల రాకతో సంతోషంతో నిండి ఉంటుంది. అయితే ఈ 2026వ సంవత్సరమున సంక్రాంతి పండుగ ఏ రోజున ఏ తేదీలలో జరుపుకుంటున్నారు అనే విషయం పైన పండితులు ఒక స్పష్టతను ఇచ్చారు. మరి ఆ తేదీలు ఏమిటి..? ఏం చేయాలో దానిపై పండితులు తెలియజేశారు. ఈ ఏడాది 2026వ సంవత్సరంలో సంక్రాంతి పండుగ ఏ తేదీలలో వచ్చింది, అనే విషయం పై పండితులు ఒక స్పష్టతను ఇచ్చారు. సంక్రాంతి పండుగ( 13- 14,14-15) నా అనేది గందరగోళంగా నెలకొంది. పండితులు, ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ల ప్రకారం స్పష్టత వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ పండితులు, ప్రభుత్వ సెలవుల ప్రకారం ఈ తేదీలలో నిర్ణయించబడినట్లు తెలిపారు.

Advertisement

Sankranti 2026 Dates : ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు…? జనవరి 14 నా, 15 నా..? దీనిపై పండితుల స్పష్టత…?

Sankranti 2026 Dates పండుగ,తేదీ, వారం :

14 బుధవారం భోగి, 15 గురువారం మకర సంక్రాంతి, 16 శుక్రవారం కనుమ.17 శనివారం ఈ విధంగా స్పష్టత తెలియజేశారు పండితులు.

Advertisement

మరి గందరగోళం ఎందుకు వచ్చింది : సూర్యుడు మకర రాశి లోనికి ప్రవేశించిన సమయాన్ని మకర సంక్రాంతిగా నిర్ణయించారు.మకర రాశిలోకి ప్రవేశించడం కారణంగా మకర సంక్రాంతి అని పేరు వచ్చింది.

సక్రమణ సమయం : సూర్య సంక్రమణం, మకర సంక్రాంతి రోజున మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో జరుగుతుందని పండితులు అంచనా వేశారు.

Advertisement

ఉదయ తిధి ప్రమాణికం : హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయ సమయానికి ఉన్నతిధినే ప్రమాణికంగా తీసుకుంటారు. సంకరమణం, 14న ఆలస్యంగా జరుగుతుంది.కాబట్టి,మరుసటి రోజున అంటే జనవరి 15వ తేదీన, సూర్యోదయం నాటికి సంక్రాంతి తిది,ఉన్నందున ఆ రోజు పెద్ద పండుగ అయిన మకర సంక్రాంతిని జరుపుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు.

పాటించాల్సిన విధానం : పైన చెప్పిన విధంగా ఈ తేదీలు అనగా.. (14, 15,16 ) కారకంగా ఇంకా ప్రామాణికంగా భావిస్తున్నప్పటికీ, పండుగ ఆచారాల ప్రాంతాన్ని బట్టి కుటుంబ సంప్రదాయాన్ని బట్టి మారుతూ వస్తాయి. అలాగే మీ కుటుంబం ఆచారం,స్థానిక దేవాలయ విధానం, మీ పెద్దల సూచనల మేరకు పండుగను జరుపుకుంటే మంచిది.

సంక్రాంతి పండుగ తేదీలు  : ఇలాంటి సందేహం లేకుండా జనవరి 14న భోగి పండుగ జరుపుకోవాలని ప్రారంభించి 15 సంక్రాంతి లక్ష్మీ ఆహ్వానించి 16 కనుమున పశువులను పూజించి ఆనందంగా జరుపుకోండి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి