ఏ వారం ఏ రంగు దుస్తులు ధరించాలో మీకు తెలుసా ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఏ వారం ఏ రంగు దుస్తులు ధరించాలో మీకు తెలుసా !

 Authored By saidulu | The Telugu News | Updated on :17 January 2021,11:58 pm

వారం.. అంటే సోమవారం నుంచి ఆదివారం వరకు ఏడు రోజులు. వీటి వెనుక అనేక ఖగోళ రహస్యాలు, ప్రకృతి సంబంధ విషయాలు దాగి ఉన్నాయి. ఒక్కో వారం వెనుక ఒక్కో గ్రహాధిపతి ఉంటారు. అయితే ఈ వారం రోజుల్లో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిదో తెలుసుకుందాం…

which colour wearing week days

which colour wearing week days

కొందరికి కొన్ని రంగులు అంటే ఇష్టం. ఆ రంగులను ఎక్కువగా వాడుతారు. దీనినే కలర్ సైన్స్ అంటారు. ఇక జ్యోతిషం ప్రకారం ఆయా రోజులకు అధిపతుల ప్రకారం ఆయా రంగుల దుస్తులను ధరిస్తే మనకు గ్రహానుగ్రహం లభించడమే కాకుండా మంచి ఫలితాలు వస్తాయి.

ఆదివారం

ఆదివారం నాడు సూర్యుహోరలో సూర్య ఉదయం జరుగుతుంది. ఈ రోజున గులాబీ రంగు కలిగిన వస్త్రాలను ధరించాలి. లేదా తెలుపు రంగు దుస్తులను ధరించడం మంచిది.

సోమవారం

సోమవారం అంటే చంద్రునికి ప్రతీక, కాబట్టి ఈ రోజున తెల్లటి వస్త్రాలను ధరించండి.

మంగళవారం

మంగళవారం కుజుడు అధిపతి. మంగళవారంనాడు ప్రత్యేకంగా కాషాయం రంగు లేదా ఎరుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించండి.

బుధవారం

వారంలో మూడవ రోజు బుధుడు అధిపతి ఈ రోజు. పచ్చరంగు కలిగిన వస్త్రాలను ధరించాలి. లేదా లేతపసుపు రంగు దుస్తులను ధరించాలి.

గురువారం

ఈరోజు అధిపతి బృహస్పతి. బృహస్పతి దేవునికి పసుపు రంగంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించాలి లేదా బంగారు రంగు దుస్తులు ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

శుక్రవారం

శుక్రవారం అధిపతి శుక్రుడు. ఈగ్రహానికి ప్రతీకరం తెలుపు రంగు. కాబటి్ తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది లేదా ఈ రోజున అన్ని రంగుల మిశ్రమమున్న వస్త్రాన్ని ధరించండి.

శనివారం

ఈరోజుకు అధిపతి శని కాబట్టి ఆయనకు ప్రతీకరమైన నీలిరంగు దుస్తులను వాడాలి. దీని వల్ల శని అనుగ్రహం కలుగుతుంది.
ఇలా ఎవరికి వీలైన దుస్తులు వారు ధరిస్తే మంచిది. అదేవిధంగా గ్రహచారం లేదా గోచారం ప్రకారం ఏ గ్రహాలు స్థితి బాగులేదో ఆ గ్రహాలకు సంబంధించి వారాలలో ఆయా రంగు దుస్తులను ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

saidulu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది