
which Jyotirlinga you should worship to your zodiac sign
మేషరాశి: రామేశ్వర జ్యోతిర్లంగం ఆరాధించాలి.
శ్లోకం:- “సుతామ్ర పర్ణీ జలరాశి యోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖ్యై !
శ్రీరామ చంద్రేన సమర్పితం తం, రామేశ్వరాఖ్యం నియతం నమామి.” !!
ఈ రాశి కుజునికి స్వగృహం, చర రాశి వారికి పదకండవ ఇంటి అధిపతి అయిన శని బాధకుడు. గ్రహ పీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర,, పైన చెప్పిన శ్లోకం రోజు చదువుకొనుట చేయవలెను, శ్రీరామ చంద్రుడు శని బాధ నివారణార్ధం ఈ లింగము స్తాపించేనని చెప్పబడినది. కుజునకు కందుల దానము, ఎర్ర వస్త్ర దానములుకుడా చేసిన మంచి ఫలితములు వస్తాయి.
which Jyotirlinga you should worship to your zodiac sign
శ్లోకం:- “సౌ రాష్ట్ర దేశే విదేశే తిరమ్యే జ్యోతిర్మయం చంద్ద్ర కళావ సంతం,భక్తి ప్రాధానాయ క్రుపావతీర్ణం తం సోమనాధం శరణం ప్రపద్యే.”
ఈ రాశి శుక్రునికి స్వ గృహం, చంద్రునికి ఉచ్చ రాశి. సోమనాధ జ్యోతిర్లింగం శ్రీ క్రిష్ణుడుచే స్తాపించ బడింది. ఈ రాశికి శని నవామాదిపత్య బాధకుడు అయినందున శని దోషాలకు సోమనాధ దేవాలయ దర్శనం, పై శ్లోక ధ్యానము చేసిన సుభ ప్రదము. జన్మ నక్షత్రమందు రుద్రాభిషేకం చేయించుట వలన మంచి ఫలితములు పొందగలరు. బొబ్బర్ల దానము, బియ్యము దానము చేసిన మంచిది.
మిధున రాశి: “నాగేశ్వర జ్యోతిర్లింగం”
శ్లోకం:-“యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భొగై !
సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీ నగనాధం శరణం ప్రపద్యే.”
ఈరాశి బుధునికి స్వగృహము. దోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శన, ప్రతి రోజు పై శ్లోకమును చదువుట, ఈ రాశి శని సంచరించు కాలమునందు జన్మ నక్షత్రం రోజున కైలాస యంత్ర ప్రస్తార మహా లింగార్చన జరిపించిన విశేషమైన ఫలితములు కలుగును.
కర్కాటకం: “ఓం కార జ్యోతిర్లింగం”
శ్లోకం:-“కావేరికా నర్మదాయో పవిత్రే , సమాగమే సజ్జన తారణాయ,
సదైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే”
ఈ రాశి చంద్రునకు స్వగృహం , . ఓం కార జ్యోతిర్లింగ దర్శనం, రోజు పై శ్లోకం చదువుట , జన్మ నక్షత్రం రోజున ఓం కార బీజాక్షరం ఉచారిస్తూ ఉండటం మంచి నివారణ ఉపాయములు.
శ్లోకం:-“ఇలాపురే రమ్య విశాల కేస్మిన్ సముల్ల సంతం చ జగద్వ రేణ్యం,
వందే మహా దారాతర స్వభావం, ఘ్రుశ్నేస్వరాఖ్యం శరణం ప్రపద్యే.”
సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘ్రుష్నేస్వర జ్యోతిర్లింగ దర్శనం, పై శ్లోకమును రోజు చదువుట, జన్మ నక్షత్రం నాడు ఏక దశ రుద్రాభిషేకం ద్వారా దోషాలనుండి విముక్తి పొందవచ్చును.
కన్యా రాశి: “శ్రీ శైల జ్యోతిర్లింగం”.
శ్లోకం:-“శ్రీ శైల శ్రుంగే విభుధాతి సంగే తులాద్రి తుంగే పి ముదావసంతం !
తమర్జునం మల్లిక పూర్వ మేకం, నమామి సంసార సముద్ర సేతుం.”
ఈ రాశికి అధిపతి బుధుడు. బాధల నుండి ఉపశమనం పొందుటకు శ్రీ శైల మల్లిఖార్జున దర్శనం, భ్రమరాంబ కి కుంకుమ అర్చన, జన్మ నక్షత్రం రోజున చండి హోమం చేసిన ఉపశమనం పొందగలరు. రోజు పైన చెప్పిన శ్లోకం చదువుట, జన్మ నక్షత్రం రోజున ఆవుకి ఆకు కూరలు, పచ్చ పెసలు తినిపించుట మంచిది. గమనిక : మిగతా రాశుల Zodiac Sign గురించి తరువాలి బాగంలో ఇవ్వడం జరుగుతుంది
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.