Today horoscope : మార్చి 28 రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today horoscope : మార్చి 28 రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు !

 Authored By keshava | The Telugu News | Updated on :27 March 2021,10:15 pm

Today horoscope : మార్చి 28 – ఫాల్గుణ మాసం – ఆదివారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, ఫాల్గుణమాసం, శుక్లపక్షం, ఆదివారం, తిథి: పూర్ణిమ రాత్రి 12.18 వరకు తదుపరి పాడ్యమి, నక్షత్రం: ఉత్తర ఫల్గుణి సాయంత్రం 5.36 వరకు తదుపరి హస్త, వర్జ్యం: రాత్రి 1.06 నుండి 2.32 వరకు, అమృత ఘడియలు: ఉదయం 11.05 నుండి పగలు 12.32 వరకు, రాహుకాలం: పగలు 4.57 నుండి సాయంత్రం 6.29 వరకు, దుర్ముహూర్తం: పగలు 4.51 నుండి 5.40 వరకు.

Today horoscope : మేషరాశి : విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన యోగం కలుగుతుంది. సమాజంలో కిర్తి ప్రతిష్టలు పొందుతారు. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సహకారం పొందుతారు. మిత్ర లాభం కలుగుతుంది. ఎంత కష్టమైన పనినైనా ధైర్యంగా ఆత్మస్థైర్యంతో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అధిక లాభాలు వస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. అనారోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

Today horoscope : వృషభ రాశి : సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు !

ఈ రోజు బాగుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. కుటుంబ సభ్యులతో స్నేహితులతో ఆయన వారితో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యుల సహకారం పొందుతారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో పదోన్నతులు పొందుతారు. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. కార్య సిద్ధి కలుగుతుంది. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు అన్నపూర్ణా దేవిని ఆరాధించండి.

horoscope

horoscope

మిధునరాశి : సమాజంలో గౌరవ మర్యాదలు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. స్నేహితులతో అయిన వారితో అందరితో సంతోషంగా సఖ్యతగా ఉంటారు. రుణ బాధలు తొలగిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉత్తమ కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ప్రయాణ సౌఖ్యం కలుగుతుంది. నూతన గృహం కొనుగోలు చేస్తారు. ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి

కర్కాటక రాశి : వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. దంపతులు ఇద్దరు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయపాలన పాటిస్తారు. సంతోషంగా ఉంటారు. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. క్రొత్త ప్రయోగాలు చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సహకారం పొందుతారు. వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యాన్ని పొందుతారు. ఈరోజు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

సింహరాశి : ధనవృద్ధి కలుగుతుంది !

ఈరోజు బాగుంటుంది. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. ధనవృద్ధి కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఇంతకుముందు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. అయినవారి ఆదరణ పొందుతారు. అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపార ధనాభివృద్ధి కలుగుతుంది. ఈరోజు శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని ఆరాధించండి.

కన్యారాశి : సమాజంలో పేరుప్రఖ్యాతులు పొందుతారు !

ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన యోగం కలుగుతుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తిచేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. మీ మాట తీరు బాగుండటం వల్ల అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. సోదరులతో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరుప్రఖ్యాతులు పొందుతారు. విద్యార్థులు స్నేహితులతో కలిసి చదువుకుంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. అధిక లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులు ఉత్తమ ఉద్యోగాలను పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు బాలాత్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

Today horoscope : తులారాశి : చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు !

ఈరోజు అనుకూలంగా లేదు. చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టం కలుగుతుంది. పనులు సమయానికి పూర్తి కాక వాయిదా పడతాయి. ఇబ్బందులు కలుగుతాయి. తప్పు చేసే వ్యక్తులను ప్రోత్సహించడం వల్ల అవమానం పొందుతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టం కలుగుతుంది. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో సమయపాలన పాటించకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. నష్టం కలుగుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. ఈ రోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి : వ్యాపారాల్లో మంచి అవకాశాలు వస్తాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అందరితో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. చిన్ననాటి ప్రాణ స్నేహితులు కలుసుకుంటారు. ఆనందంగా ఉంటారు. పెద్ద వారిని గౌరవిస్తారు. వారి మాటలను సూచనలను పాటిస్తారు. మీ మనసులో ఉన్న విషయాలని బయటకి చెబుతారు. సంతోషంగా ఉంటారు. గతంలో వసూలు కాని మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారాల్లో మంచి అవకాశాలు వస్తాయి. అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి.
ఈరోజు అష్టాదశ శక్తి పేట స్తోత్ర పారాయణం చేసుకోండి.

ధనస్సురాశి : ధన యోగం కలుగుతుంది !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. అవసరానికి డబ్బులు రుణ బాధలు తీరిపోతాయి. ధన యోగం కలుగుతుంది. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. వాక్చాతుర్యం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. ఆనందంగా ఉంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

మకరరాశి : అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి !

ఈ రోజు బాగుంటుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. రుణ బాధలు తీరిపోతాయి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన వృద్ధి కలుగుతుంది. సోదరులతో సఖ్యతగా సంతోషంగా ఉంటారు. వ్యాపారాల్లో మంచి అవకాశాలు వస్తాయి. అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. ఈరోజు శ్రీ దక్షిణామూర్తి స్వామిని ఆరాధించండి.

కుంభరాశి : వ్యాపారాల్లో లాభాలు పొందుతారు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. ప్రయాణం అనుకూలత ఏర్పడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ధన వృద్ధి కలుగుతుంది. స్నేహితులతో అందరితో సంతోషంగా సఖ్యతగా ఉంటారు. సోదరులతో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. గతంలో ఉన్న అనారోగ్యాని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును, గౌరవాన్ని తిరిగి పొందుతారు. ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

మీనరాశి : ప్రయాణ లాభాలు కలుగుతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. ప్రయాణ లాభాలు కలుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి.
ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

Advertisement
WhatsApp Group Join Now

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది