Temple : గుడికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లకూడదా.. మరెప్పుడు వెళ్లాలి?
Temple : ఎక్కువగా మనకు వీలున్న సమయాల్లోనే గుడికి వెళ్తుంటాం. చాలా మంది ఉదయమే ఆలయాలకు వెళ్లడం మంచిదని పొద్దునే వెళ్తుంటారు. కానీ మరి కొంత మందికి అది వీలు పడకపోవడంతో… తమకు వీలు కుదిరినప్పుడు వెళ్తుంటారు. అంటే పొద్దున 11, 12 గంటలు లేదా సాయంత్రం సమయాల్లో వెళ్తుంటారు. అయితే చాలా మందికి ఈ అనుమానం వస్తూ ఉంటుంది. అదేంటంటే… మనం రోజులో ఎప్పుడైనా గుడికి వెళ్లొచ్చా.. లేదా గుడికి వెళ్లేందుకు ఏవైనా ప్రత్యేక సమసయాలు ఉన్నాయా అని. అయితే గుడికి ఈ సమయాల్లోనే వెళ్లాలనే నియమాలు ఉన్నాయి. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.నిజం చెప్పాలంటే మనకు అవకాశం ఉన్నంత మేరకు ఉదయమే గుడికి వెళ్లడం చాలా మంచిది.
ముఖ్యంగా శ్రీ మహా విష్ణువు, ఆయన అవతారలైన దేవుళ్లని ఉదయమే దర్శించుకోవాలట. అలాగే సాయంకాల సమసయంలో శంకరుడిని ఆయన రూపాలైన మిగతా దేవుళ్లని ప్రతిరోజూ దర్శించుకోవాలని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే సాధ్యం కాని పని. కాకపోతే విష్ణు ఆలయాలను ఉదయమే దర్శించుకోవడం వెనుక ఓ కథ ఉంది. అందేంటంటే విష్ణాలయంలో తులసి తీర్థాన్ని, పూల మాలనీ ఇస్తారు. మనం ఉదయాన్నే దేవుడిని దర్శించడం వల్ల.. తులసీ తీర్థం మనం శరీరంలోకి వెళ్లి శ్వాసకోశాన్ని శుభ్రపరుస్తుంది. పూమాల అలంకార ప్రియత్వాన్ని కల్గిస్తుంది. ఇదంతా దినచర్య ప్రారంభంలో లేదా జీవిత ప్రారంభంలో అవసరం.ఇక సాయంత్రం శివుడిని దర్శించుకున్నప్పుడు మారేడు ఆకులు ముంచిన నీటిని తీర్థంగా, భస్మాన్ని ఇస్తారు.
మారేడు నీరు జీర్ణకోశాన్ని శుభ్రపరుస్తుంది. భస్మం ఒక తీరు వైరాగ్య దృష్టిని కల్గజేస్తుంది. ఈ తీరు భావన, రోజు ముగిశాక ఏం చేశానని పరిశీలించుకున్న పశ్చాత్తాప పడడానికి లేదా జీవితపు చరమకాలంలోనూ ముక్తికి అవసరం. ఈ ప్రశ్నకే మరో కోణం నుంచి సమాధానాన్ని చూస్తే…. మనసుకి ఏ విధమైన తొందరా లేక కేవలం దేవుడిని దర్శించాలని అనిపించినప్పుడు, పరమ సంతోష వార్తని విన్నప్పుడు కృతజ్ఞతని చెప్పుకునేందుకు… పరమ దుఃఖం కల్గినప్పుడు ఒడ్డున వేయ వలసిన నదిని దీనంగా ప్రార్థించేందుకు… భగవంతుడికి ఇష్టమైన పర్వ దినాల్లోనూ గుడికి వెళ్లాలి. అయితే ఇలాంటి సమయాల్లో దేవుడిని దర్శించడం వల్ల తప్పకుండా భగవంతుని మీద గురి కుదురుతుంది. మనపై కూడా ఆ దేవుడి కృప తప్పకుండా ఉంటుంది.