Ashada Masam : ఆషాడ మాసంలోనే గోరింటాకును ఎందుకు పెట్టుకుంటారు.. గోరింటాకు వలన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా…
Ashada Masam : మన సనాతన సాంప్రదాయం ప్రకారం పూర్వ కాలం నుంచి ఇప్పటి వరకు ఆషాడ మాసంకు చాలా ప్రక్యాత ఉంది. ఈ ఆషాడ మాసంలో కోన్ని సాంప్రదాలను కట్టుబాటలను పాటిస్తారు . ఆషాడ మాసం వచ్చిందంటే తోలకరి చినుకులుతో వర్షాకాలం మొదలవుతుంది . ఈ వర్షాల వలన ప్రకృతికి పచ్చని చీరను కట్టినట్టుగా అందంగా ఉంటుంది . చెట్లు పచ్చగా ,పాడి ,పంటలు భాగా అభివృద్ధి చెందుతాయి. అయితే ఈ ఆషాడ మాసం లో మన సాంప్రదాయ కట్టుబాటల ప్రకారం గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితిగా వస్తుంది. ఇలా పెట్టుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి . ఆషాడ మాసం రాగానే మన స్త్రీలు గోరింటాకును పెట్టుకోవడానికి చాలా ఇష్టపడతారు . కారణం ఆషాడంలో గోరింటాకు మిగతా రోజుల్లో కెల్లా ఆషాడ మాసం లోనే గోరింటాకు ఎక్కువగా పండుతుంది . ఎందుకంటే వర్షాలు అధికంగా పడతాయి కాబట్టి గోరింటాకులో నీటి శాతం అధికంగా ఉంటుంది . మిగతా కాలంలో నీటిశాతం అంతగా ఉండదు.
వర్షా కాలంలో నీటిని,పచ్చదనం కలిగి ఉండటం వలన గోరింటాకు భాగా ఎర్రగా పండుతుంది . మిగతా కాలంలో పచ్చదనం అంతగా ఉండదు . అప్పుడు ఆషాడ మాసంలో పండినంతగా గోరింటాకు అంతగా పండదు. ఆషాడ మాసంతో పాటు వర్షాలు అధికంగా కురుస్తాయి కాబట్టి. అప్పుడు అంట్టు వ్యాధులు ప్రభలే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ అంట్టు వ్యాధుల నుండి మనలని మనం రక్షించుకొవడానికై ఈ గోరింటాకును పెట్టుకుంటారు . ఈ గోరింటాకును ఆరోగ్య పరంగా ఆడవారు మాత్రమే కాదు మగవారు కూడా పెట్టుకోవచ్చు . ఎందుకంటే వర్షాల వలన వాతావరణం చల్లబడి ఉంటుంది. అప్పుడు మన భాడిలో వేడి పెరుగుతుంది. ఈ వేడిని తగ్గించే గుణం ఈ గోరింటాకుకు ఉంటుంది. అంతే కాదు గోరింటాకును కాళ్ళకు పెట్టుకొవడం వలన మన శరిరంలో వేడి వలన ఎర్పడే పగుళ్ళను తగ్గిస్తుంది. అధిక వేడి వలన వచ్చే వ్యాధులను తగ్గించవచ్చు. గోరింటాకును జుట్టుకు కూడా పెడతారు. ఇలా పెట్టుకోవడం వలన జుట్టు ఆరోగ్యంగా వత్తుగా పెరుగుతుంది . చుండ్రు సమస్యకూడా తగ్గుతుంది.
స్త్రీలకు గర్బస్థ సమస్యలు కూడా ఈ గోరింటాకు వలన నివారించవచ్చు .గర్భినిలు గోరింటాకును పెట్టుకోవడం వలన తల్లి ఆరోగ్యంగా ఉండటమే కాక పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడుతుంది. పూర్వంలో గర్భినిలకు గోరింటాకును నూరి గోళి సైజ్ లో మింగిస్తారు . కారణం పుట్టే పిల్లలు ఎర్రగా అందంగా పుట్టాలని మరియు ప్రసవం తరువాత వచ్చే గర్బశయ వ్యాధులు రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా తినిపిస్తారు. అలాగే స్త్రీలు ఆషాడ మాసంలో గోరింటాకును ఐదు సార్లు పెట్టుకోవడం వలన ధీర్ఘ సుమంగళి యోగం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు .ఈ ఆషాడ మాసంలో కోత్త పెళ్లి కూతురు పుట్టింటికి వెళ్ళడం, ఆషాడం ముగిసిన తరువాత తిరిగి అత్తవారింటికి రావడం పూరతన కాలం నుంచి ఇప్పటి వరకు సాంప్రదాయంగా పాటిస్తున్నారు.
హైదరాబాద్ లో ప్రజలు ఆషాడ మాసం వస్తే బోనాల పండుగా కనుల విందుగా గనంగా జరుపుకుంటారు. ఎందుకంటే తోలకరి చినుకులు వలన అనేక అంటు వ్యాధులు వస్తాయని అవి సోకకుండా ఆరోగ్యంగా ఉండాలని గ్రామదేవతలను పూజిస్తారు. అది ప్రజల యొక్క నమ్మకం. గోరింటాకు భాగా పండాలంటే నూరేటప్పుడు కొంచెం చింతపండు , కొంచెం మజ్జిగ వేసి నూరడం వలన భాగా ఎర్రగా పండుతుంది. గోరిటాకును కాళ్ళకు , చెతులకు పెట్టుకోవడం వలన వేడి తగ్గడమే కాక స్త్రీలకు అంధాన్ని పెంచుతుంది . ఆషాడ మాసంకు మరియు గోరింటాకుకు ఇంత విశిష్టతను కలిగి ఉంటుంది. ఇది చూసాకా గోరింటాకును ఇష్టపడనివారు ఉంటారా ! ఇంకేందుకు ఆలస్యం ఆషాడం వచ్చెసింది త్వరగా వేళ్లి గోరింటాకును తెచ్చెసి నూరుకోని కాళ్ళకు , చేతులకు నిండుగా పెట్టుకోండి . అంధాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.