Good Peoples : మంచివారే ఎందుకు ముందు చనిపోతారు…? పురాణ గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే..?
ప్రధానాంశాలు:
Good Peoples : మంచివారే ఎందుకు ముందు చనిపోతారు...? పురాణ గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే..?
Good Peoples : మన వెనకటి తరానికి చెందిన మన తాత ముత్తాతలు దాదాపు 100 సంవత్సరాలు వరకు జీవించేవారు. కానీ ప్రస్తుత కాలంలో మనుషులు 60 లేదా 70 సంవత్సరాలు మాత్రమే జీవిస్తున్నారు. అందులోనూ మంచివారు చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అయితే దేవుడు మంచివారిని చాలా త్వరగా ఆయన దగ్గరకు తీసుకెళ్లి పోతుంటాడని మన పెద్దలు చెబుతుంటే విన్న..అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా…?చెడు చేసే వారి కంటే కూడా మంచివారు ఎందుకు త్వరగాా చనిపోతారు..?అంతేకాక చాలా సందర్భాలలో దేవుడు మంచి చేసిన వాడిని ఎందుకు త్వరగా తీసుకుపోతాడు…! ఎంత కఠినాత్ముడు అంటూ పలువురు దేవుని తిట్టడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే నిజంగా ఇలా జరుగుతుంది అంటారా…దీనికి గల అసలు కారణం ఏమై ఉంటుంది…? మరి దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Good Peoples : భగవద్గీతలో దేవుడు ఏం చెప్పారంటే…
అయితే ఈ విషయం గురించి చాలా గ్రంథాలలో వివరించడం జరిగింది.” జాతస్య హి ధ్రువః మృత్యు” అని భగవంతుడు గీతాలో చెప్పాడు. గీత లోని ఈ సారం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మా సనాతన ధర్మంలో ఒక వ్యక్తి జన్మించక ముందే అతను ఎక్కడ ఎప్పుడు ఎలా పుడతాడు..? అతని తల్లిదండ్రులు ఎవరు..? ఎవరిని పెళ్లి చేసుకుంటాడు..? ఎలాంటి పిల్లలకు జన్మనిస్తాడు..? ఆ తర్వాత ఎక్కడ ఎప్పుడు చనిపోతాడో కూడా ముందే రాసిపెట్టి ఉంటుందని నమ్ముతారు. అన్ని మతాలలో కూడా మరణం మాత్రమే తిరుగులేని సత్యమని నమ్ముతారు. ఎవరు జన్మించిన ఏదో ఒక రోజు మరణించక తప్పదనేది వాస్తవం.అయితేడ శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మన పెద్దలు అంటుంటారు.

Good Peoples : మంచివారే ఎందుకు ముందు చనిపోతారు…? పురాణ గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే..?
అంటే ఇక్కడ దేవుడు ఆజ్ఞ లేకుండా ఏది జరగదని అర్థం. అయితే ఇక్కడ దేవుడు ప్రతి మంచి వ్యక్తిని ఏదో ఒక కారణం కోసమే ఈ ప్రపంచంలోకి పంపిస్తాడని మన హిందూమతంలోని పురాతన గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఏ కారణంతో అయితే ఆ మంచి వ్యక్తి ఈ భూమ్మీదకి వస్తాడో ఆ కారణం పూర్తవగానే దేవుడు వారిని తిరిగి వెనక్కి రప్పించేసుకుంటాడని , నమ్మకం. అంటే మంచి వ్యక్తుల మరణం అనేది వారు చేసే మంచి పనుల పైన ఆధారపడి ఉంటుందని హిందువులు బలంగా విశ్వసిస్తారు. ఇక ఈ కలియుగంలో పాపాలు చేసే పాపులు ఎక్కువ కాలం జీవిస్తారని పుణ్యాలు చేసే పుణ్యాత్ములు ఈ లోకాన్ని త్వరగా విడిచిపెట్టి వెళ్లిపోతారని తెలుస్తోంది.