Navagrahas : నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్లు ఎందుకు కడుక్కోవాలి?
Navagrahas : మనం గుడికి వెళ్లినప్పు కాళ్లు, చేతులు, మొహం కడుక్కున్నాకే లోపలికి వెళ్తాం. ఆ తర్వాత దేడిని దర్శించుకొని మొక్కులు కూడా చెల్లించుకుంటాం. అయితే ఆలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం కాళ్లు, చేతులు వంటివి ఏం కడుక్కోం. కానీ నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత కానీ లేదా పూజ చేసిన తర్వాత గానీ కచ్చితంగా కాళ్లు కడ్డుక్కోవాలని చెబుతుంటారు చాలా మంది. దేవాలయంలో ఉన్న నవ గ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్లు కుడుక్కోకపోతే […]
Navagrahas : మనం గుడికి వెళ్లినప్పు కాళ్లు, చేతులు, మొహం కడుక్కున్నాకే లోపలికి వెళ్తాం. ఆ తర్వాత దేడిని దర్శించుకొని మొక్కులు కూడా చెల్లించుకుంటాం. అయితే ఆలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం కాళ్లు, చేతులు వంటివి ఏం కడుక్కోం. కానీ నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత కానీ లేదా పూజ చేసిన తర్వాత గానీ కచ్చితంగా కాళ్లు కడ్డుక్కోవాలని చెబుతుంటారు చాలా మంది. దేవాలయంలో ఉన్న నవ గ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్లు కుడుక్కోకపోతే ఏదో పీడ కల్గుతుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది.ఆ పీడను వదిలించుకునేందుకు మనం నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటాం.
అయితే గ్రహ పీడా నివృత్తి కోసం గనవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలని మన పురాణాలు చెబుతున్నాయి. తర్వాత కాళ్లు కడుక్కోమని ఏ పురాణాల్లోనూ లేదు. నవ గ్రహాల ఆలయమైనా లేదా మరో దేవాలయం అయినా అన్నీ పవిత్రమైనవే. అలా పవిత్ర ప్రదేశంలో చేసిన సత్కర్మ వ్యక్తిని పవిత్రుడిని చేస్తుంది. కానీ అపవిత్రత అంటదు. పవిత్ర ప్రదేశంలో పవిత్ర కర్మను ఆచరించి అపవిత్రతను భావించడమే పెద్ద దోషం. కొంత మంది నవగ్రహ ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్లను కుడుక్కొని తర్వాత మాత్రమే శివాలయ ప్రదక్షిణ చేస్తారు. అలా చేయడానికి కారణం… ఒక్కో చోట ఒక్కో ఆచార సంప్రదాయాలు ఉంటాయి. వాటి మధ్య చాలా భేదాలు కూడా ఉంటాయి.
వీటికి ఎలాంటి శాస్త్రాలు ఉండవు. వీటికి సంప్రదాయం ముఖ్యం. పూర్వం శివాలయాలను శ్మశాన భూములుగా భావించారు. అందుకే పవిత్ర పుణ్య క్షేత్రమైన కాశీని మహా శ్మశానం ఉన్నారు. శివ సన్నిధిలో పూర్వం ఏ ప్రసాదం స్వీకరించే వారు కాదు. సామాన్యంగా శివాలయాల్లోనే నవగ్రహ ప్రతిష్ట ఎక్కువగా చేస్తుంటారు. అక్కడి శన్యాది గ్రహాలకు ప్రదక్షిణ చేసి పాద ప్రక్షాళనం చేసేవారు. వీర శైవులు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈనాడు ఏ ప్రాంతంలోనూ ఈ సంప్రదాయాన్ని పూర్తిగా పాటించడం లేదు. కాబట్టి నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత కాళ్లు కడుక్కున్నా.. కడుక్కోక పోయినా వచ్చే సమస్య ఏం లేదు. అందుకే ఆ విషయం గురించి ఆలోచించడం మానేసి మీ మనసంతా ఆ దేవుడి మీదకే మళ్లించండి. స్వామి వారి కృపకు పాత్రులు కండి.