నవగ్రహాలకు ఈ శ్లోకాలతో ప్రదక్షణలు చేస్తే !
navagraha stotram : నవగ్రహాలు మానవుని భవిష్యత్ పై ప్రభావం చూపేవి. జ్యోతిష శాస్త్రం నమ్మేవారికి ఈ కింది అంశాలు. నమ్మనివారు వదిలివేయండి. నమ్మకం, భక్తి మనిషిని అసామాన్యుడిని చేస్తాయి. ఇక విషయంలోకి వస్తే నవగ్రహాల అనుగ్రహం ఉంటే మన స్థితి శుభంగా ఉంటుంది. దీనికోసం దేవాలయాలకు వెళ్లే వారు తప్పక నవగ్రహాలకు ప్రదక్షణలు చేస్తారు. అయితే గ్రహాల అనుగ్రహం తొందరగా లభించాలంటే కొంది శ్లోకాలను భక్తితో పఠిస్తూ తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షణలు చేయాలి. ఆ శ్లోకాలు..
‘‘జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం’’
ఈ పై శ్లోకం చదువుతూ సూర్యుడికి నమస్కారం చేయాలి. తర్వాత కింది శ్లోకంతో చంద్రుడికి నమస్కారం చేయాలి..
‘‘దధిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం
నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణం’’
కుజుడికి …
‘‘ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం
కుమారం శక్తిహస్తంతం మంగళం ప్రణమామ్యహం!
బుధుడికి..
ప్రియంగుకాలికాశ్యామం రూపేణా ప్రతిమాంబుధం
సౌమ్యంసత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం !
గురువు- బృహస్పతి….
దేవానాంచ ఋషిణాంచ గురుంకాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం !
శుక్రుడికి..
హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం !
శని గ్రహానికి..
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయామార్తాండ సంభూతం తం నమామి శసైశ్చరం !
రాహువుకు…
అర్థకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం
సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం !
కేతువుకు…
ఫలాషపుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం !
వీటిని వ్యాసుడు రచించాడు. వీటిని పఠించడం వల్ల కింది ఫలితాలు వస్తాయి..
‘‘దివావాయ దివారౌత్రౌ విఘ్న: శాంతిర్భవిష్యతి
నర నారీ నృపాణాంచ భవే దు:స్వప్న నాశనం
ఐశ్వర్యమతులాం తేషాం ఆరోగ్యం పుష్టివర్ధనం
గ్రహ నక్షత్ర జా:పీడా స్తస్కరాగ్ని సముద్భవాం
తాసర్వా: ప్రశమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయ:
ఓం ఇతి శ్రీ నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ’’
అంటే గ్రహ బాధలు పోవడమే కాకుండా ఐశ్యర్యం, ఆరోగ్యం, పుష్టి వంటివి లభిస్తాయి. వీటితోపాటు శని బాధ పడుతున్నవారు కింది మంత్రాలను మనసులో చదువుకుంటూ నవ్రగ్రహాలకు ప్రదక్షణలు చేయాలి. అవి.. శని నాద తరంగిణి మంత్రాలు ..
ఓం ఖ్రాం ఖ్రీం ఖ్రీం ఖ్రీం సః శనియేనమః !
ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనేశ్చరాయణ నమః !
ఈ మంత్రాలు చాలా శక్తివంతమైనవి. బయటకు చదవవద్దు, ఎందుకంటే వీటిలో బీజాక్షరాలు ఉన్నాయి. తప్పు చదివితే ఫలితం మారిపోతుంది. అక్షరాలు తప్పు చదవకుండా భక్తితో మానసికంగా పై బీజాక్షరాలు చదువుకోండి. మంచి ఫలితం వస్తుంది.