Trigrahi Yoga : త్రిగ్రహి యోగం తో ఈ రాశులు కోటీశ్వరులు ఇవ్వడం ఖాయం…!
ప్రధానాంశాలు:
Trigrahi Yoga : త్రిగ్రహి యోగం తో ఈ రాశులు కోటీశ్వరులు ఇవ్వడం ఖాయం...!
Trigrahi Yoga : జ్యోతిష శాస్త్రం లో అతిపెద్ద గ్రహాలైన సూర్యుడు ,బుధుడు మరియు శని కుంభరాశిలో త్రిగ్రహి యోగాన్ని ఏర్పరిచారు. శని ప్రస్తుతం కుంభరాశి సంచరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 11 వ తేదీన బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశించాడు. అలాగే ఫిబ్రవరి 12వ తేదీన సూర్యుడు కుంభరాశిలో తన సంచారాన్ని ప్రారంభించాడు. అయితే ఈ మూడు గ్రహాలు కుంభరాశిలో సంచరించడం కారణంగా త్రిగ్రహీ యోగం ఏర్పడింది. ఈ యోగం తో ఐదు రాశుల వారికి సానుకూల ప్రయోజనాలు చేకూరుతున్నాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Trigrahi Yoga : త్రిగ్రహి యోగం తో ఈ రాశులు కోటీశ్వరులు ఇవ్వడం ఖాయం…!
Trigrahi Yoga : మేష రాశి
త్రిగ్రహీ యోగం కారణంగా మేష రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఇక ఉద్యోగలు వ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణ నెలకొంటుంది . ఇక ఈ సమయంలో మేష రాశి జాతకులు కొన్ని శుభవార్తలను వింటారు. అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు తరుచుకుంటాయి.
Trigrahi Yoga : వృషభ రాశి
కుంభరాశి లో త్రిగ్రహి యోగం కారణంగా వృషభ రాశి జాతకులకు మంచి జరుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఇక ఈ రాశి వారు నూతన గృహాలను మరియు ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఆకస్మిత ధన లాభం కలగడంతో వీరికి కలిసి వస్తుంది.
మిధున రాశి : త్రిగ్రహి యోగం కారణంగా మిధున రాశి జాతకులకు అదృష్టం ప్రకాశిస్తుంది. కెరియర్ బాగుంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు రావడంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మిధున రాశి జాతకులు మతపరమైన ప్రదేశాలను సందర్శించడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విధాల లబ్ధి చేకూరుతుంది.
కన్యారాశి : కుంభ రాశిలో త్రిగ్రహి యోగం కారణంగా కన్య రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలను పేరు ప్రఖ్యాత లను పొందుతారు. ఈ సమయంలో కన్యారాశి జాతకులు శత్రువుల పై విజయం సాధిస్తారు.
ధనుస్సు రాశి : త్రిగ్రహి యోగం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. కెరియర్ బాగుంటుంది. అయితే ఈ సమయంలో వీరికి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు. ఇక ఈ సమయంలో ధనస్సు రాశి వారు కొన్ని శుభవార్తలను వింటారు. ఆదాయం రెట్టింపు అవుతుంది.