Yogini Ekadashi : సాంప్రదాయాల ప్రకారం ప్రతి నెలలో రెండు సార్లు ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు. ఏకాదశి తిది లో మొదటిది కృష్ణ పక్షం . అలాగే రెండవది శుక్లపక్షం. ప్రతి నెల చేసే ఏకాదశి వ్రతాలకున రెండు పేర్లు ఉండడం వలన విభిన్న ప్రాముఖ్యతను చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే జూలై నెలలో ఏకాదశి ఉపవాసం ఎప్పుడు ఉండాలి…?? అలాగే శుభ ముహూర్తాలు మరియు పూజా సమయం వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం….
నిజ్జల ఏకాదశి తర్వాత యోగిని ఏకాదశి ఉపవాసం ఉంటుంది. అలాగే తొలి ఏకాదశి ముందు దేవశయని ఏకాదశి ఉపవాసాన్ని ఆచరిస్తారు. కానీ తెలుగు వారి క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే జులై నెలలో కృష్ణపక్షంలోని ఏకాదశి రోజున యోగిని ఏకాదశి ఉపవాసాన్ని పాటిస్తారు. అయితే ఈ ఏడాది జూన్ 2న యోగినీ ఏకాదశి రావడం జరిగింది. పురాణాల ప్రకారం ఆ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. దేవశయని ఏకాదశికి ముందు యోగినీ ఏకాదశి వస్తుంది కాబట్టి ఆ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. ఇక హిందూమతంలో లయకారుడైన శివునికి త్రయోదశి అంకితం చేసినట్లుగా సృష్టి పోషకుడైన విష్ణుమూర్తికి ఏకాదశి తిధి ఉపవాసం అంకితం చేయడం జరిగింది. అయితే ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి శ్రీ మహా విష్ణు మూర్తిని పూజించడం ద్వారా శ్రీ హరి విశేష అనుగ్రహం లభిస్తుంది. ఏకాదశి వ్రతాన్ని ప్రతి నెల రెండుసార్లు పాటించాలి.
జేష్ఠ మాసం కృష్ణ ప్రక్ష ఏకాదశి తేదీ ప్రారంభం – 1 జులై 2024 ఉదయం 10 :26 నుండి మొదలవుతుంది. కృష్ణపక్ష ఏకాదశి తిధి ముగింపు- జులై 2 ఉదయం 8:42 గంటలకు ముగుస్తుంది.
యోగినీ ఏకాదశి వ్రతాన్ని పెద్దలు మరియు యువకులు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఏకాదశి పూజ చేయడం ద్వారా విశేష ఫలితాలను అందుకోవచ్చు. చర్మసంబంధితలు మరియు కుష్టి వ్యాధితో బాధపడుతున్న ఎవరైనా ఈ ఉపవాసం చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ ఉపవాసం ఆచరించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.
యోగినీ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణుని పూజించాలి. పద్మ పురాణాల్లో భాగంగా యోగినీ ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా ఎన్నో యోగాలను చేసిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. అలాగే గత జన్మల్లో చేసిన పాపాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. యోగినీ ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణు నామస్మరణ చేయడం మంచిది. ఈ విధంగా సంతోషం సంపద శ్రేయస్సు వంటివి పొందవచ్చు. అయితే బ్రహ్మ పురాణాల్లో శ్రీకృష్ణుడు స్వయంగా యోగినీ ఏకాదశి గురించి యుధిష్టుడికి చెప్పినట్లుగా తెలుస్తుంది. యోగినీ ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం వల్ల పుణ్యం లభిస్తుందని అనుకుంటారు. హిందువుల విశ్వాసం ప్రకారం చాలా ముఖ్యమైనదని వారి నమ్మకం. దేశంలో చాలా ప్రాంతాలలోఈ ఉపవాసాన్ని ఆచరిస్తారు. అనారోగ్య వ్యాధుల నుంచి త్వరగా కోలుకోవడానికి ఏకాదశి అతి ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు. అయితే ఈ వ్రతాన్ని ఆడవారు మగవారు ఎవరైనా ఆచరించవచ్చు. ఉపవాసం పాటించి విష్ణుమూర్తిని పూజిస్తూ విష్ణు సహస్రనామాలను పట్టించాలి.
పద్మ పురాణాల ప్రకారం హేమమాలిని అనే తోటమాలికి విశాక్షి అనే అందమైన భార్య ఉండేది. హేమమాలిని అనకాపూరి అనే రాజ్యంలో ఒక ఉద్యానవనం కి తోటమాలిగా బాధ్యతలు నిర్వహించేవాడు. అయితే ఇక రాజు కుబేరుడు విష్ణు భక్తుడు పూజలు ప్రార్థనలు చేస్తాడు. మానస సరోవరం నుంచి తాజా పూలను తీసుకువచ్చేవాడు. ఈ పూలతో కుబేరుడు శివుడిని ప్రార్థించేవాడు. అయితే ఒక రోజు హేమమాలిని పూలు తీసుకురాకపోవడంతో కుబేరుడు ఆలస్యం అయిందని బటులను హేమవాలి వద్దకు పంపిస్తాడు. అదే సమయంలో హేమమాలి తన భార్యతో ఉంటాడు.
ఈ విషయాన్ని బటులు రాజుకి చెబుతారు. హేమమాలిని వెంటనే పిలుచుకురమ్మంటాడు. హేమమాలి కుష్టు వ్యాధితో బాధపడాలని అలాగే భార్య నుంచి విడిపోవాలని రాజు హుకుం జారీ చేస్తాడు. హేమమాలిని అడివిలో కుష్టి వ్యాధితో బాధపడుతుంటాడు. అక్కడ ఉన్న మార్కండేయ అనే ఆశ్రమానికి చేరుకుంటాడు. తన శాపానికి సంబంధించిన విషయాలను చెప్పి శాప విముక్తి కలిగించాలని ముని ని కోరుతాడు. అయితే ముని ఆషాడ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున దీక్ష ఉండాలని అలాగే విష్ణుమూర్తిని పూజించాలని చెబుతారు. ఈ దీక్షని అత్యంత శ్రద్ధ భక్తితో పూజిస్తాడు. అలా విష్ణుమూర్తి ఆశీస్సులను పొంది శాపం నుంచి విముక్తుడు అవుతాడు. దీంతో హేమమాలినికి పూర్వరూపం రావడమే కాకుండా తన భార్యతో సంతోషంగా జీవితాన్ని గడుపుతాడు.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.