Yogini Ekadashi : రేపే యోగినీ ఏకాదశి… ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇలా చేస్తే ఉపశమనం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Yogini Ekadashi : రేపే యోగినీ ఏకాదశి… ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇలా చేస్తే ఉపశమనం…!

 Authored By ramu | The Telugu News | Updated on :1 July 2024,5:10 pm

ప్రధానాంశాలు:

  •  Yogini Ekadashi : రేపే యోగినీ ఏకాదశి... ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇలా చేస్తే ఉపశమనం...!

Yogini Ekadashi : సాంప్రదాయాల ప్రకారం ప్రతి నెలలో రెండు సార్లు ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు. ఏకాదశి తిది లో మొదటిది కృష్ణ పక్షం . అలాగే రెండవది శుక్లపక్షం. ప్రతి నెల చేసే ఏకాదశి వ్రతాలకున రెండు పేర్లు ఉండడం వలన విభిన్న ప్రాముఖ్యతను చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే జూలై నెలలో ఏకాదశి ఉపవాసం ఎప్పుడు ఉండాలి…?? అలాగే శుభ ముహూర్తాలు మరియు పూజా సమయం వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం….

నిజ్జల ఏకాదశి తర్వాత యోగిని ఏకాదశి ఉపవాసం ఉంటుంది. అలాగే తొలి ఏకాదశి ముందు దేవశయని ఏకాదశి ఉపవాసాన్ని ఆచరిస్తారు. కానీ తెలుగు వారి క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే జులై నెలలో కృష్ణపక్షంలోని ఏకాదశి రోజున యోగిని ఏకాదశి ఉపవాసాన్ని పాటిస్తారు. అయితే ఈ ఏడాది జూన్ 2న యోగినీ ఏకాదశి రావడం జరిగింది. పురాణాల ప్రకారం ఆ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. దేవశయని ఏకాదశికి ముందు యోగినీ ఏకాదశి వస్తుంది కాబట్టి ఆ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. ఇక హిందూమతంలో లయకారుడైన శివునికి త్రయోదశి అంకితం చేసినట్లుగా సృష్టి పోషకుడైన విష్ణుమూర్తికి ఏకాదశి తిధి ఉపవాసం అంకితం చేయడం జరిగింది. అయితే ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి శ్రీ మహా విష్ణు మూర్తిని పూజించడం ద్వారా శ్రీ హరి విశేష అనుగ్రహం లభిస్తుంది. ఏకాదశి వ్రతాన్ని ప్రతి నెల రెండుసార్లు పాటించాలి.

Yogini Ekadashi : యోగినీ ఏకాదశి 2024 శుభసమయాలు ఎప్పుడంటే.

జేష్ఠ మాసం కృష్ణ ప్రక్ష ఏకాదశి తేదీ ప్రారంభం – 1 జులై 2024 ఉదయం 10 :26 నుండి మొదలవుతుంది. కృష్ణపక్ష ఏకాదశి తిధి ముగింపు- జులై 2 ఉదయం 8:42 గంటలకు ముగుస్తుంది.

Yogini Ekadashi : ఆరోగ్యం కోసం యోగిని ఏకాదశి

యోగినీ ఏకాదశి వ్రతాన్ని పెద్దలు మరియు యువకులు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఏకాదశి పూజ చేయడం ద్వారా విశేష ఫలితాలను అందుకోవచ్చు. చర్మసంబంధితలు మరియు కుష్టి వ్యాధితో బాధపడుతున్న ఎవరైనా ఈ ఉపవాసం చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ ఉపవాసం ఆచరించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

Yogini Ekadashi యోగినీ ఏకాదశి ప్రాముఖ్యత.

యోగినీ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణుని పూజించాలి. పద్మ పురాణాల్లో భాగంగా యోగినీ ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా ఎన్నో యోగాలను చేసిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. అలాగే గత జన్మల్లో చేసిన పాపాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. యోగినీ ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణు నామస్మరణ చేయడం మంచిది. ఈ విధంగా సంతోషం సంపద శ్రేయస్సు వంటివి పొందవచ్చు. అయితే బ్రహ్మ పురాణాల్లో శ్రీకృష్ణుడు స్వయంగా యోగినీ ఏకాదశి గురించి యుధిష్టుడికి చెప్పినట్లుగా తెలుస్తుంది. యోగినీ ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం వల్ల పుణ్యం లభిస్తుందని అనుకుంటారు. హిందువుల విశ్వాసం ప్రకారం చాలా ముఖ్యమైనదని వారి నమ్మకం. దేశంలో చాలా ప్రాంతాలలోఈ ఉపవాసాన్ని ఆచరిస్తారు. అనారోగ్య వ్యాధుల నుంచి త్వరగా కోలుకోవడానికి ఏకాదశి అతి ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు. అయితే ఈ వ్రతాన్ని ఆడవారు మగవారు ఎవరైనా ఆచరించవచ్చు. ఉపవాసం పాటించి విష్ణుమూర్తిని పూజిస్తూ విష్ణు సహస్రనామాలను పట్టించాలి.

Yogini Ekadashi యోగినీ ఏకాదశి పురాణ కథ(పద్మ పురాణం ప్రకారం)

పద్మ పురాణాల ప్రకారం హేమమాలిని అనే తోటమాలికి విశాక్షి అనే అందమైన భార్య ఉండేది. హేమమాలిని అనకాపూరి అనే రాజ్యంలో ఒక ఉద్యానవనం కి తోటమాలిగా బాధ్యతలు నిర్వహించేవాడు. అయితే ఇక రాజు కుబేరుడు విష్ణు భక్తుడు పూజలు ప్రార్థనలు చేస్తాడు. మానస సరోవరం నుంచి తాజా పూలను తీసుకువచ్చేవాడు. ఈ పూలతో కుబేరుడు శివుడిని ప్రార్థించేవాడు. అయితే ఒక రోజు హేమమాలిని పూలు తీసుకురాకపోవడంతో కుబేరుడు ఆలస్యం అయిందని బటులను హేమవాలి వద్దకు పంపిస్తాడు. అదే సమయంలో హేమమాలి తన భార్యతో ఉంటాడు.

Yogini Ekadashi రేపే యోగినీ ఏకాదశి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇలా చేస్తే ఉపశమనం

Yogini Ekadashi : రేపే యోగినీ ఏకాదశి… ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇలా చేస్తే ఉపశమనం…!

ఈ విషయాన్ని బటులు రాజుకి చెబుతారు. హేమమాలిని వెంటనే పిలుచుకురమ్మంటాడు. హేమమాలి కుష్టు వ్యాధితో బాధపడాలని అలాగే భార్య నుంచి విడిపోవాలని రాజు హుకుం జారీ చేస్తాడు. హేమమాలిని అడివిలో కుష్టి వ్యాధితో బాధపడుతుంటాడు. అక్కడ ఉన్న మార్కండేయ అనే ఆశ్రమానికి చేరుకుంటాడు. తన శాపానికి సంబంధించిన విషయాలను చెప్పి శాప విముక్తి కలిగించాలని ముని ని కోరుతాడు. అయితే ముని ఆషాడ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున దీక్ష ఉండాలని అలాగే విష్ణుమూర్తిని పూజించాలని చెబుతారు. ఈ దీక్షని అత్యంత శ్రద్ధ భక్తితో పూజిస్తాడు. అలా విష్ణుమూర్తి ఆశీస్సులను పొంది శాపం నుంచి విముక్తుడు అవుతాడు. దీంతో హేమమాలినికి పూర్వరూపం రావడమే కాకుండా తన భార్యతో సంతోషంగా జీవితాన్ని గడుపుతాడు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది