కోటీశ్వరులు కావాలంటే ఉగాదిలోపు ఈ పని చేయాల్సిందే..!
ఈ ఏడాది తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది పండుగ ఏ0ప్రిల్ ఒకటి రెండు తేదీల్లో వస్తోంది. అయితే చాలా మందికి ఏ రోజు పండుగ చేసుకోవాలో తెలీక తెగ మదన పడిపోతున్నారు. అంతే కాదండోయ్ ఏప్రిల్ 1న సూర్యోదయం సమయంలో ఉగాది గడియలు లేకపోవడం వల్ల ఏప్రిల్ 2న మాత్రమే ఉగాది పండుగ చేసుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు. అయితే ఆ రోజు తప్పకుండా ఉగాది పచ్చడి తిని, పంచాగ శ్రవణం వినడం తెలుగు వారికి అలవాటు. అలాగే ఉగాదిని తమిళ నాడు, మహారాష్ట్ర, కన్నడ వారు కూడా జరుపుకుంటారు. ఉగాది లోపు గోవులకు ఆహారం తినిపించడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.నానబెట్టిన కందులు, బెల్లం తనిపించడం వల్ల ఇంట్లో ఉండే కుటుంబ సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు.
అలాగే నల్ల నువ్వులు, బెల్లం తినిపించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని వేద పండితులు వివరిస్తున్నారు. అలాగే బీట్ రూట్, పాలకూర తినిపించడం వల్ల లక్ష్మీ దేవి యొక్క అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. నానబెట్టిన ఉలవలు, బెల్లం తనిపిస్తే… సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నానబెట్టిన శనగలు, బెల్లం తనిపించడం వల్ల మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు. కామధేనువుని సురభి అని కూడా పిలుస్తారు. అయితే పురాతన హిందూ గ్రంథాల ప్రకారం గోవు సకల దేవతలకు నిలయం. అంత్ కాదండోయ్ కామధేనువుని అన్ని పశువులకు తల్లిగా అభివర్ణిస్తారు. అలాగే బ్రహ్మచే తండ్రి అయిన శివుడి 11 మంది అనుచరులైన రుద్రులకు తల్లిగా వర్ణింపబడింది.
అందుకే గోవులను నాటి నుంచి వరకు హిందువులు పూజించడం ఆనవాయితీగా వస్తోంది.ఎక్కడ ఆవు కనిపించినా వెంటనే దాన్ని తాకడం లేదా మొక్కడం వంటివి చేస్తుంటారు చాలా మంది. అంతే కాకుండా మనకు అందుబాటులో ఉన్న పదార్థాలను తినిపిస్తుంటాం. ఏవైనా ప్రత్యేక రోజులు, పండుగలు ఉన్నప్పుడు వాటి కోసం ప్రత్యేక వంటకాలు చేసి కూడా తనిపిస్తుంటారు చాలా మంది. ఆవు కడుపు నింపి దాని కృపకు పాత్రులయ్యేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే సకల దేవతలకు నిలయమైన గోవు ఒక్క దాన్ని సంతృప్తి పరిస్తే… అన్ని దేవుళ్ల దయ తమపై ఉంటుందని భావిస్తుంటారు. అందుకే ఆవును కనిపిస్తే చాలు ప్రత్యేక పూజలు చేస్తూ.. మురిసిపోతుంటారు మన హిందువులు.