Lakshmi Devi Kataksham : కోటీశ్వరులు కావాలి అంటే రోజు అర్ధరాత్రి కచ్చితంగా ఈ 5 పనులు చేయాలి…!
ప్రధానాంశాలు:
Lakshmi Devi Kataksham : కోటీశ్వరులు కావాలి అంటే రోజు అర్ధరాత్రి కచ్చితంగా ఈ 5 పనులు చేయాలి...!
Lakshmi Devi Kataksham : ఆ లక్ష్మీదేవి కటాక్షం కావాలని అమ్మవారి దయ కోసం ఎదురుచూడని వాళ్ళు ఎవరైనా ఉంటారా.. ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరూ కోరుకునేది ప్రతినిత్యం అమ్మవారి దయమని మీద ఉండాలి. మనం కష్టపడి పనిచేయటానికి అమ్మవారి ఆశీస్సులు కావాలి. లక్ష్మీ కటాక్షం ఉంటే తప్ప మనం ఆనందంగా ఉండలేమని ప్రతి ఒక్కరికి తెలుసు. లక్ష్మీదేవి చల్లని చూపు మనపై ఉండాలని ఆమె దృష్టి మన పట్ల ఎప్పుడూ ఉండాలని ఎన్నో పూజలు పునస్కారాలు యజ్ఞలు, యాగాలు, వ్రతాలు, నోములు, దానధర్మాలు చేస్తూనే ఉంటాము. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ వస్తుందా అంటే రాదు.. అందరికీ వస్తే ఈరోజు ఈ అంశం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కొంతమంది మాత్రం లక్ష్మీ కరుణకి లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులవుతుంటే మరి కొందరు మాత్రం ఆ లక్ష్మీదేవి చల్లని చూపు కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి లక్ష్మీ కటాక్షం కలగదు. ఎందుకో తెలుసుకునే ప్రయత్నాలు చేయరు. మనం ప్రతినిత్యం ఇంట్లో చేసుకునేటువంటి చిన్న చిన్న పనుల మీద కూడా శ్రద్ధ పెడితే కచ్చితంగా లక్ష్మీదేవి యొక్క కరుణ మన అందరి మీద ఉంటుంది.
ఏమరపాటులో తెలిసి తెలియక చేసేటువంటి తప్పులు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంటే తను సంతోషంగా ఎలా ఉంటుంది.లక్ష్మీదేవి ఇష్టపడే పనులు కొన్ని ఉంటాయి. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులు మనం కనుక చేస్తే లక్ష్మీ మన ఇంట్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తుంది అని చెప్తూ ఉంటారు. అలాగే అమ్మవారి కరుణ కటాక్షాలు కూడా అంతే అమ్మవారు ఏ ఏ పనులు చేస్తే ఇష్టపడుతుందో ఆపనులు మనం చేస్తే ఖచ్చితంగా అమ్మవారి కటాక్షం మన పట్ల ఉంటుంది. అయితే రాత్రిపూట భోజనం చేసిన తర్వాత చాలామంది తిన్న పాత్రలని శుభ్రం చేయకుండా అలాగే ఉంచేస్తూ ఉంటారు. ఈ పద్ధతి ఇంతకుముందు ఎప్పుడూ లేదు. రాత్రిపూట చాలా తొందరగా భోజనాలు చేసేసి చాలా తొందరగా నిద్రపోయేటువంటి అలవాటు ఉండేది. కొన్నేళ్ల క్రితం కానీ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలు, పనులు వ్యాపారాలలో భాగంగా తినేటటువంటి సమయం అర్ధరాత్రి అవుతుంది . నిద్రపోయే సమయం తెల్లవారుజామున అవుతుంది. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. చాలామంది కుటుంబాల్లో జరుగుతున్నటువంటి అంశం అయితే నిద్రపోయేటప్పుడు వంట గదిలో ఖాళీ అయిన పాత్రల్ని శుభ్రం చేసే నిద్రపోవాలి. లేదంటే ఆ ఇంటిని దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెబుతూ ఉంటారు. చేసేటువంటి పనుల్లో విజయం వరిస్తుంది. అలాగే గడపని మనం పరిశుభ్రంగా ఎప్పుడు ఉంచుకోవాలి. పొరపాటున కూడా తొక్కకూడదు. దానిమీద కూర్చోకూడదు.
ఆ గడపని అపరిశుభ్రంగా ఉంచకూడదు. సింహద్వారం దగ్గర ఉన్నటువంటి గడపని ఎప్పుడూ పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి.అలాగే ఇల్లు మారుతున్నప్పుడు మనం సరిగా ఉపయోగించని వస్తువులు ఏమైనా ఉంటే వాటిల్లో నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది. వాటిని ఎవరికైనా లేదంటే పారేయటం లాంటివి చేయాలి. వాటిని అమ్మేసి వాటి ద్వారా డబ్బు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. ఇంట్లో రాత్రిపూట ఎప్పుడు గొడవలు పడకూడదు. గట్టిగటిగా మాట్లాడటం తిట్టుకోవడం ఏడవటం, లాంటివి ఇంటి ఇల్లాలు అర్ధరాత్రి పూట చేయకూడదు. అలాగే ఇల్లంతా తిరగకూడదు. చెడు మాటలు, బూతు మాటలు, ఇంట్లో ఉండకూడదు. వేరొకరిని నాశనం చేసేటువంటి ప్రయత్నాలు ఆలోచనలు చేయకూడదు. వేరే వారి మీద నిందలు వేయకూడదు. ఇలాంటివి ఏ ఇంట్లో అయితే రాత్రిపూట జరుగుతుంటాయి. ఆ ఇంటికి లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడదు ఇంట్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి మన వల్ల బాధపడకూడదు. లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్షాలు మీ పట్ల మెండుగా ఉండాలి. అంటే రాత్రిపూట చెప్పిన విధంగా చేయాల్సిన పనులు చేయండి. చెయ్యకుండా ఉండాల్సిన పనులకి దూరంగా ఉండండి…