Coconut Tips : ఒక్క కొబ్బరి కాయ.. మీ జీవితంలోని సమస్యలన్నింటినీ తీర్చేస్తుంది తెలుసా?
Coconut Tips : మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొబ్బరి కాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనం ఎలాంటి పూజ లేదా వ్రతం చేసినా కచ్చితంగా కొబ్బరికాయ కొడ్తుంటాం. గుడికి వెళ్లినప్పుడు కూడా కచ్చితంగా టెంకాయ తీసుకొని వెళ్తుంటాం. దేవతా మూర్తులను కొబ్బరి కాయలతో పూజించడం వల్ల వారి కృపకు పాత్రులం అవుతమాని హిందువుల విశ్వసం. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొబ్బరి కాయ ద్వారా వ్యక్తి జీవితంలోని అనేక సమస్యలను తొలగించుకోవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొబ్బరి కాయ వలన వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మన ఇంటిపై కానీ కుటుంబ సభ్యులపై కాని చెడు దృష్టి పడటం వల్లప్రతికూల ప్ర ఇంటిపై, ఇంట్లోని వ్యక్తుల జీవితంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దృష్టి వల్లే కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు, వివాదాలు జరుగుతాయని మనకు తెలిసిందే. అయితే, ఈ ప్రతికూలతను తొలగించడానికి కొబ్బరికాయ ఉపకరిస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఇంటి పెద్ద దిష్టి తగిలిన వ్యక్తి మీద నుంచి 11 సార్లు కొబ్బరి కాయను తిప్పాలి. ఆ తర్వాత దాన్ని కాల్చి బూడిదను నీటిలో కలిపేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. అలాగే ఇంట్లోని వారెవరైనా అంతు చిక్కని వ్యాధులతో సతమతం అవుతుంటే… కొబ్బరి కాయలో వాస్తు నివారణ చర్యలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు.
ఎర్రటి గుడ్డలో కొబ్బరి కాయను చుట్టి… దానిని రోగి శరీరంపై నుంచి 7 సార్లు తిప్పాలి. ఆ తరువాత ఆ కొబ్బరికాయను హనుమంతుని పాదాల చెంత పెట్టాలి. ఇలా చేయడం ద్వారా బాధిత వ్యక్తి త్వరగా కోలుకుంటాడని విశ్వాసం.అలాగే చాలా మంది కష్టపడి, అంకిత భావంతో పని చేస్తున్నప్పటికీ తరచూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. దీనికి వాస్తు దోషాలే కారణం అని వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తు దోషాల కారణంగా లక్ష్మీ ఆగ్రహానికి గురై.. వారి నుంచి వెళ్లిపోతుందట. ఫలితంగా ఆర్థిక సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే గురువారం లక్ష్మీ దేవిని పూజించాలని పండితులు చెబుతున్నారు. ఆ తర్వాత పసుపు బట్ట తీసుకుని అందులో కొబ్బరి కాయ కట్టాలి. ఆ కొబ్బరికాయను లక్ష్మీ దేవి పాదాల చెంత ఉంచాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ దేవి, విష్ణువు కూడా ప్రసన్నమై.. ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తారని చెబుతున్నారు.