Prakash Raj : మా ప్యానెల్‌‌కు 11 మంది రాజీనామా.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల సంచలన నిర్ణయం..

 Authored By praveen | The Telugu News | Updated on :12 October 2021,6:07 pm

Prakash Raj : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు పోటీ చేయగా 11 మంది గెలుపొందారు. అయితే, అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ప్రెస్‌మీట్ పెట్టి ఆ విషయాలను వెల్లడించారు.

11 resign from prakash raj panel members

11 resign from prakash raj panel members

‘మా’ సభ్యుల సంక్షేమం కోసం సిని‘మా’ బిడ్డలు ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ, జాయింట్ సెక్రెటరీ ఉత్తేజ్‌తో పాటు మిగతా ఈసీ మెంబర్స్ బుధవారం మంచు విష్ణుకు రాజీనామా ఇస్తున్నట్లు తెలిపారు. ‘మా’ సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను విష్ణు నెరవేర్చాలని, నెరవేర్చని పక్షంలో తాము ఆర్టిస్టుల పక్షాన నిలబడి ప్రశ్నిస్తామని ప్రకాశ్ తెలిపారు.

ఇకపోతే తాను ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ఇచ్చానని, అది ఉపసంహరించుకోవాలంటే తెలుగు వారు కాని వారు ఎవరైనా మా అధ్యక్ష పదవికి పోటీ చేయొచ్చనే నిబంధన మార్చకూడదని అన్నారు. అలా చేస్తే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా వెనక్కు తీసుకుంటానని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.

praveen

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి