Intinti Gruhalakshmi 12 July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 జులై 2022, మంగళవారం ఎపిసోడ్ 682 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్ గెలిచినందుకు తులసి ఫ్యామిలీ బోనాల పండుగను సెలబ్రేట్ చేస్తుంటారు. మరోవైపు నందు, లాస్య, భాగ్య కూడా అదే బోనాల పండుగకు వస్తారు. నువ్వు బోనం ఎత్తుతావా.. నీకు బోనం ఎలా చేయాలో తెలియదు కదా అంటాడు నందు. దీంతో నాకు బోనాలు చేయాలని ఉంది.. చేస్తాను అంటుంది లాస్య. దీంతో గుడిలోకి అడుగు పెడతారు ముగ్గురు. దేవుడిని మొక్కుతూ లాస్య లోపలికి వెళ్తుంది. మరోవైపు తులసి బోనం వండుతూ ఉంటుంది. అందరూ తనకు సహకరిస్తారు.
ఇంతలో తులసి, తన ఫ్యామిలీని నందు, లాస్య చూస్తారు. చూసి షాక్ అవుతారు. వాళ్లను చూసినా చూడనట్టుగా అక్కడి నుంచి వెళ్లిపోతారు నందు, లాస్య. పక్కనే మరో టెంట్ లో బోనం వండుతూ ఉంటారు. మనం లేట్ గా వచ్చినట్టున్నాం లాస్య అంటుంది భాగ్య. దీంతో ఎప్పుడు వచ్చాం అనేది కాదు.. ఎంత భక్తితో వచ్చాం అన్నది ముఖ్యం అంటుంది లాస్య. మరోవైపు అనసూయ కూడా లాస్యపై విరుచుకుపడుతుంది. దీంతో అత్తయ్య మీరు ఏం మాట్లాడకండి అంటుంది తులసి. వీళ్లు బోనాలు ఎత్తుతారా అంటూ అనసూయ తనను అవమానిస్తుంది లాస్య.
మరోవైపు అనసూయ నోర్మూసుకుంటుంది. ప్రేమ్.. బోనం కోసం మట్టికుండలు తెచ్చాం కదా.. ఎక్కడున్నాయి అని అడుగుతుంది తులసి. దీంతో మన వేహికిల్ లో ఉన్నాయి అంటాడు ప్రేమ్. దీంతో సరే నేను తీసుకొస్తా అంటుంది దివ్య. వాటిని జాగ్రత్తగా తీసుకురా. లేకపోతే బోనం ఆగిపోతుంది. అవి చుట్టుపక్కన ఎక్కడా దొరకవు అని అంటాడు పరందామయ్య.
దీంతో లాస్యకు ఒక ప్లాన్ వేస్తుంది. వెంటనే భాగ్యకు చెబుతుంది. మరోవైపు వాహనం దగ్గరికి వెళ్తూ ఉంటుంది దివ్య. కుండలు తీసుకొని వస్తూ.. అక్కడ ఒకరు డ్యాన్స్ వేస్తుంటే అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్లి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది దివ్య.
దివ్య వెనుకే వెళ్లిన భాగ్య.. తనను తోసేస్తుంది. దీంతో రెండు కుండలు కింద పడిపోతాయి. దీంతో అయ్యో దివ్య అంటూ తులసి అక్కడికి వస్తుంది. అందరూ అక్కడికి వస్తారు. బోనం పెట్టాల్సిన కుండలు పగిలిపోయాయి. ఎంత అరిష్టం. అమ్మవారికి కోపం వచ్చినట్టుంది అంటారు అక్కడున్న వాళ్లు.
ఇప్పుడు బోనం ఎలా ఎత్తాలి.. కుండలు లేవు. ఆగిపోయినట్టేనా అని అంటాడు పరందామయ్య. ఇంతలో అక్కడికి తన అన్న భార్య వచ్చి.. వదిన ఇదిగో కొత్త కుండలు అని తెచ్చి ఇస్తుంది. దీంతో తులసి సంతోషిస్తుంది. మొదటి సారి బోనం చేస్తున్నావని నీకు కుండలు ఇద్దామని వచ్చా అని చెబుతుంది.
ఈ ప్లాన్ వర్కవుట్ కాకపోతే ఇంకో ప్లాన్ వేస్తుంది లాస్య. తులసి బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించకుండా ఉండేందుకు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకొస్తుంది. భాగ్యకు ఇచ్చి బోనాలు ఎత్తేముందు పోతరాజు తులసికి మజ్జిగ ఇచ్చే సమయంలో ఆ మజ్జిగలో ఇవి కలపాలి అంటుంది లాస్య.
పోతరాజు మజ్జిగ ఇచ్చేటప్పుడు మజ్జిగలో నువ్వే ఈ ట్యాబ్లెట్స్ కలపాలి అంటుంది లాస్య. దీంతో అమ్మో.. నా వల్ల కాదు అంటుంది. దీంతో భాగ్యను మోటివేట్ చేస్తుంది. మరోవైపు తులసి బోనం ఎత్తుకొని నడుస్తూ ఉంటుంది. ఇంతలో తనకు కళ్లు తిరుగుతాయి. దీంతో బోనం కింద పడేస్తుంది.. అన్నట్టుగా కలలు కంటూ ఉంటుంది లాస్య.
ఇంతలో భాగ్య వచ్చి ఈవిడ ఏంటి.. వేళ కాని వేళ నిద్రపోతోంది. లాస్య.. లాస్య అంటూ లేపుతుంది. దీంతో ఎక్కడున్నాయి.. కుండ ముక్కలు ఎక్కడ అని అంటుంది. దీంతో ముందు ఆ లోకం నుంచి బయటికి రా అంటుంది భాగ్య.
మరోవైపు వసుధర, సాక్షి ఇద్దరూ బోనం సమర్పిస్తారు. పోతరాజు మజ్జిగలో మెల్లగా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేస్తుంది భాగ్య. తులసి బోనం రెడీ చేస్తుండగా అక్కడికి వసుధర, సాక్షి ఇద్దరూ వస్తారు. ఆ తర్వాత అమ్మవారికి ఎవరు బోనం సమర్పించాలి అని తులసి, లాస్య మధ్య పోటీ వస్తుంది.
లాస్యే కోడలి హోదాలో మొక్కు తీర్చుకోవాలని నందు అంటాడు. ఇంతలో పోతరాజు వస్తాడు. అతడు ఇచ్చిన మజ్జిగ తాగుతుంది తులసి. బోనం సమర్పించాక.. నీ జీవితంలోకి కొత్త మనిషి వస్తాడు అని జోగిని చెబుతుంది. ఇంతకీ ఎవరా వ్యక్తి.. తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Waqf Amendment : పార్లమెంటులో శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో వక్ఫ్ ఆస్తులు, మతపరమైన విషయాల…
Allu Ayaan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun మరి కొద్ది రోజులలో పుష్ప2 అనే సినిమాతో…
Nagababu : ఆంద్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ రావడం మనం చూశాం. ఏపీతోపాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్…
Pawan Kalyan : మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం హిందువులపై జరుపుతున్న అకృత్యాలను అరికట్టాలని కోరిన మత…
Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుపతి జిల్లాలో నవంబర్ 26 నుంచి 28 వరకు భారీ…
Eknath Shinde : మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిపై ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే తనను ముఖ్యమంత్రిని చేయకుంటే ఏక్‌నాథ్ షిండే రాష్ట్ర…
Keerthy Suresh Relationship : మహానటి కీర్తి సురేష పెళ్లి గురించి కొన్నాళ్లుగా నెట్టింట అనేక వార్తలు వస్తున్న విషయం…
Smartphone : డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు రోజువారీ జీవితంలో ఒక అనివార్య భాగంగా మారాయి. కమ్యూనికేషన్, వినోదం మరియు సమాచార…
This website uses cookies.