
10 month old child has a job in railways
Railway Job : చిన్నపిల్లలు ఉద్యోగాలు చేయడం చూశారా.. వాళ్లను ఎవరు భర్తి చేసుకుంటారు. ఎందుకు భర్తి చేసుకుంటారో తెలుసా..? మనం సాధారణంగా చాలా సందర్బాల్లో చూశాం చిన్న పిల్లలు పోలీస్ డ్రెస్ వేసుకుని ఐపీఎస్.. ఎస్పీ.. సీఐ.. ఎస్సై.. ఇలా దర్శనమిస్తుంటారు. ఇక్కడ విషయమేంటంటే ఆ పాప లేదా బాబు ఏదో తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఎక్కువ రోజులు బతకలేదని తెలిసినప్పుడు ఆ పాప ఏం కావాలనుకుంటుందో తెలుసుకుని వాళ్ల చివరి కోరిక తీర్చడానికి వాళ్లు అడిగిన హోదాలో కాసేపు కూర్చోబెడతారు. ఇలాంటి సంఘటనలు చాలానే చూశాం కానీ.. ప్రస్తుతం ఓ పదినెలల చిన్నారి ఆరోగ్యంగానే ఉంది.. ఆమెకు జాబ్ కావాలని కూడా ఎవరూ అడగలేదు.. కానీ రైల్వేలో ఉద్యోగం వచ్చింది.ఇండియన్ రైల్వేలో ఓ అరుదైన రిక్రూట్ మెంట్ జరిగింది.
పది నెలల చిన్నారికి రైల్వేలో ఉద్యోగం ఇచ్చారు. ఇప్పటి వరకు ఇండియన్ రైల్వే చరిత్రలో మొట్టమొదటి సారి ఇలాంటి ఉద్యోగ భర్తి జరిగింది. మరి ఆ పాప ఇప్పుడు జాబ్ కి ఎలా వస్తుందనే కదా మీ డౌట్.. ఆ పాప ఇప్పుడే జాబ్ కి రానక్కర్లేదు. 18 ఏళ్లు నిండిన తర్వాత నేరుగా జాబ్ లో జాయిన్ అయ్యే అవకాశం కల్పించారు. ఈ విషయాన్ని స్వయంగా రైల్వే అధికారులు వెల్లడించారు. ఆ పాప వేలిముద్రలను తీసుకుని రికార్డ్స్ లో అధికారికంగా రిజిస్ట్రేషన్ కూడా చేశారు. అసలు ఆ పాపకి ఇంత చిన్న వయసులో రైల్వే జాబ్ ఇందుకిచ్చినట్లు ఆ పాప ఎవరు..? ఎక్కడ ఈ అరుదైన రిక్రూట్ మెంట్ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఓ రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన పది నెలల చిన్నారికి రైల్వే ఉద్యోగం వచ్చింది. మేజర్ కాగానే నేరుగా ఉద్యోగంలో చేరొచ్చని రైల్వే డిపార్ట్ మెంట్ తెలిపింది.
10 month old child has a job in railways
పది నెలల చిన్నారికి రైల్వే ఉద్యోగం ఇస్తున్నట్టు ఛత్తీస్‌గఢ్ రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ రిక్రూట్‌మెంట్ వెనక ఓ విషాద ఘటన మనం తెలుసుకోవాలి. గత నెల జూన్ 1న ఈ పాప తల్లిదండ్రులు రోడ్ యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఈ పాప తండ్రి రాజేంద్ర కుమార్, బిలయ్‌లోని రైల్వే యార్డ్‌లో అసిస్టెంట్‌గా పని చేసేవారు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించగా పాప ప్రాణాలతో బయటపడింది. దీంతో ఆ పాపకు రాయ్‌పూర్ రైల్వే డివిజన్‌లో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ సిబ్బంది విభాగంలో ఉద్యోగం ఇస్తున్నట్టు జులై 4వ తేదీన అధికారిక ప్రకటన చేశారు. పాపకి 18 ఏళ్లు నిండిన తర్వాత నేరుగా జాబ్ లో జాయిన్ అయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. నిబంధనల ప్రకారం బాధిత కుటుంబానికి అన్ని విధాల సహకరిస్తామని వెల్లడించారు. కారుణ్య నియామకంలో భాగంగా ఈ రిక్రూట్‌మెంట్ చేపడతామని చెప్పారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.