30 weds 21 : 30 వెడ్స్‌ 21 సీజన్‌ 2.. పృథ్వీ, మేఘన రొమాన్స్‌ పీక్స్‌

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: February 1, 2022, 3:30 pm

30 weds 21 : యూట్యూబ్‌ లో సెన్షేషన్ క్రియేట్‌ చేసిన 30 వెడ్స్ 21 వెబ్‌ సిరీస్ కు సీజన్ 2 రాబోతుంది. యూట్యూబ్‌ లో కోట్లాది వ్యూస్ ను దక్కించుకున్న ఈ వెబ్‌ సిరీస్ కోసం తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా సీజన్ 2 కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఎట్టకేలకు సీజన్ 2 కు సంబంధించిన ప్రోమో వచ్చేసింది. ప్రోమో చూస్తుంటే సీజన్ 2 అత్యంత ఆకర్షణీయంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మొదటి సీజన్ తో పోల్చితే రెండవ సీజన్ మరింత ఆకర్షణీయంగా మరియు రొమాంటిక్ కమ్‌ లవ్‌ సన్నివేశాలతో ఉండబోతున్నట్లుగా ప్రోమో చూస్తుంటే అనిపిస్తుంది. పృథ్వీ మరియు మేఘన ల మద్య రొమాన్స్ ను పీక్స్ లో చూపించడం ద్వారా యూత్‌ ఆడియన్స్‌ ను ఆకట్టుకునేలా ఉన్నారు.

మొదటి సీజన్ లో ఇద్దరి మద్య గొడవలు మరియు వయసు తేడా వల్ల పృథ్వీ పడే ఇబ్బందులను చూపించడం జరిగింది. పెళ్లి అయ్యి ఫస్ట్‌ నైట్‌ కూడా పూర్తి అయిన మేఘన మరియు పృథ్వీల మద్య ఇక ముందు వయసు తేడా వల్ల వచ్చే విభేదాల.. ఆ విభేదాల కారణంగా రొమాన్స్ పై పడే ప్రభావం ఎలా ఉంటుంది అనేది చూపించే అవకాశాలు ఉన్నాయి. వయసు తేడా ఉండటం వల్ల ఖచ్చితంగా వైవాహిక జీవితంలో కొన్ని ఒడి దొడుకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఒడి దొడుకులు వారు ఎలా అధిగమించారు.. కొత్త జీవితంను వారు ఎలా కొనసాగించారు అనేది సీజన్ 2 లో చూస్తామని అంటున్నారు.పదేళ్ల వయసు తేడా ఉన్న అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది..

30 weds 21 web series season 2 promo out and get big response

30 weds 21 web series season 2 promo out and get big response

30 weds 21 : పృథ్వీ మరియు మేఘన యూత్‌ కు మరింత చేరువ అయ్యేలా..

తద్వారా జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మరింత డెప్త్ గా చూపించడం కోసం మేకర్స్ సీజన్‌ 2 ను ప్లాన్‌ చేస్తున్నారు. ఎక్కువ గొడవ పడకుండా పృథ్వీ మరియు మేఘనల మద్య లవ్‌ కమ్‌ రొమాంటిక్ సన్నివేశాలను ఎక్కవగా చూపించడం వల్ల యూత్‌ ఆడియన్స్ కు కనెక్ట్‌ అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రోమో విడుదల చేయగానే వచ్చిన వ్యూస్‌ ను చూస్తుంటే ఏ స్థాయిలో ఈ వెబ్‌ సిరీస్ సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పలువురు ఫిల్మ్‌ మేకర్స్ మరియు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా 30 వెడ్స్ 21 వెబ్‌ సిరీస్ పై ఆసక్తి చూపించారు. ఆ సమయంలో చాలా మంది ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు సీజన్ 2 కోసం వారు కూడా ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు.

Also read

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "YS Jagan Ys sharmila : తల్లి, చెల్లి రోడ్డుమీద పడటానికి కారణం ఆయనేనట.. యలహంక ప్యాలెస్ రచ్చలో సరికొత్త ట్విస్ట్..!"

  2. "Naga Chaitanya : లోలోపల ఏడవాలనిపిస్తుంది.. కానీ కన్నీళ్లు రావు.. నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!"

  3. "Miss Universe 2026 Jennifer Barreto : మిస్ యూనివర్స్ 2026 విజేత జెన్నిఫర్ బర్రెటో.. టాప్-12లో చోటు దక్కని భారత్‌..!"

  4. "Ration Card : రేషన్ కార్డు ఉన్న మహిళలకు రేవంత్ ప్ర‌భుత్వం అదిరే గుడ్‌న్యూస్..!"

  5. "Gold Rate Today : పసిడి ప్రియులకు మరో షాక్.. 25 నవంబర్ 2026 మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. వెండి మాత్రం తగ్గింది!"

  6. "Rashmi Gautam : రష్మితో లిప్‌లాక్ కావాలన్న కమెడియన్.. బుల్లెట్ భాస్కర్ కౌంటర్‌..!"

  7. "Chicken Shop Business : చికెన్ షాప్ పెడితే లాభమా.. న‌ష్ట‌మా..1 కిలోకు ఎంత మిగులుతుందంటే? అసలు లెక్కలు ఇవే!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp