Kajal Aggarwal : బొద్దుగా మారిన కాజ‌ల్ అగ‌ర్వాల్.. భ‌లే ముద్దొస్తున్నాంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

Authored By Sam C | The Telugu News | Published on: February 1, 2022, 3:00 pm

Kajal Aggarwal: అందాల ముద్దుగుమ్మ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవ‌ల త‌న అభిమానుల‌కి గుడ్ న్యూస్ చెప్పిన విష‌యం తెలిసిందే. 2020 అక్టోబర్‌లో ఆమె ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకుంది. అయితే రెండు మూడు నెలలుగా కాజల్‌ గర్భవతి కాబోతుందనే వార్తలుఊపందుకున్నాయి. దీనిపై స్పందించిన ఆమె సరైన సమయంలో దీని గురించి మాట్లాడతానని తెలిపింది. కానీ కొత్త ఏడాది సందర్భంగా ఆమె భర్త గౌతమ్‌ కిచ్లు కాజల్‌ ప్రెగ్నెన్సీని ప్రకటించాడు. ఈ ఏడాదితో తమ బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. కాజ‌ట్ ప్రెగ్నెన్సీ అని క‌న్‌ఫాం అయిన‌ప్ప‌టి నుండి ఇంటికే ప‌రిమితం అయింది.

క‌మిట్ అయిన సినిమాల‌న్నింటిని ప‌క్క‌న పెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కి ట‌చ్‌లో ఉంటుంది.తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో కాఫీ తాగుతున్న ఫొటోని షేర్ చేసింది. ఇందులో కాజ‌ల్ చాలా బొద్దుగా క‌నిపిస్తుంది. ఈ అమ్మడి బాడీలో వ‌చ్చిన మార్పులు చూసి అంద‌రు అవాక్క‌వుతున్నారు. బొద్దుగా ఉన్నా కూడా భ‌లే ముద్దుగా ఉన్నావంటూ కొంద‌రు క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక కాజ‌ల్ సినిమాల విషయానికి వ‌స్తే ‘ఆచార్య’లో ఆమె చిరంజీవి సరసన నటించింది.

kajal aggarwal photos latest in Viral

kajal aggarwal photos latest in Viral

Kajal Aggarwal : క్యూట్ క్యూట్‌గా క‌నిపిస్తున్న కాజ‌ల్..

అలాగే దుల్కర్ సల్మాన్ తో కలిసి నటించిన లవ్ స్టోరీ ‘సినామిక’ కూడా త్వరలోనే విడుదలవుతుంది.హిందీలో కాజ‌ల్ నటించిన ‘ఉమా’ అనే చిత్రం డైరెక్ట్‌గా ఓటిటి వేదికపైకి రానుంది. ఇది కూడా సమ్మర్‌లోనే స్ట్రీమ్ అవుతుంది. అలాగే తమిళంలో ఆమె నటించిన ఒక హారర్ థ్రిల్లర్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మొత్తంగా ఈ ఏడాది ఆమె నటించిన నాలుగు చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. 2022లో ఆమె ఒక్క చిత్రంలో కూడా నటించే అవకాశం లేదు. కానీ కాజల్ థియేటర్లలో, ఓటిటి వేదికలపై ఈ ఏడాది బాగానే సందడి చేస్తుంది

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp