Anasuya : అనసూయ పరువుతీసిన యాంకర్ సుమ.. మ్యాటర్ ఏంటంటే?

Authored By Cinema Desk | The Telugu News | Published on: February 1, 2022, 1:30 pm

Anasuya : యాంకర్ సుమ, అనసూయ, రష్మీ ఇలా అందరూ కూడా బుల్లితెరపై ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటున్నారు. యాంకర్లుగా పలు షోలను చేస్తుంటారు. అయితే పండుగ ఈవెంట్లకు మాత్రం వీరంతా దూరంగానే ఉంటారు. జబర్దస్త్, ఎక్స ట్రా జబర్దస్త్‌లతో అనసూయ, రష్మీ బిజీగా ఉంటారు. ఇక సుమ అయితే అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అన్ని చోట్లా కనిపిస్తుంటుంది.

బుల్లితెరపై, వెండితెరపై, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఇలా అన్ని చోట్లా సుమ కనిపిస్తుంది. ఇక క్యాష్ షోలో గెస్టులతో సుమ చేసే అల్లరి మామూలుగా ఉండదు. సుమ దెబ్బకు అందరూ నోరు మూసుకోవాల్సిందే. సుమ వేసే సెటైర్లకు అందరూ ఫిదా అవుతుంటారు. తాజాగా లూజర్ వెబ్ సిరీస్ టీం క్యాష్ షోకు వచ్చింది. ఇందులో భాగంగా సుశాంక్, ప్రియదర్శి వంటి వారు వచ్చారు.

Anschor Suma Satires On Anasuya Pushpa In Cash

Anschor Suma Satires On Anasuya Pushpa In Cash

Anasuya : అనసూయపై సుమ సెటైర్లు..

ఇందులో పనిష్మెంట్‌లో భాగంగా ఒక బొమ్మ గీయాల్సి ఉంటుంది. సుమ బొమ్మను గీయమంటే ప్రియదర్శి ఏదో వింత బొమ్మను గీస్తాడు. దీంతో ఇదేంటి? ఇది నేనేనా? పుష్ప సినిమాలో దాక్షాయణిలా ఉందేంటి? అని ఆ గెటప్‌ను పరోక్షంగా కించపరిచింది. అంటే పరోక్షంగా అనసూయను, అనసూయ పోషించిన పాత్రను సుమ కించపరిచేసింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp