30 weds 21 : యూట్యూబ్ లో సెన్షేషన్ క్రియేట్ చేసిన 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ కు సీజన్ 2 రాబోతుంది. యూట్యూబ్ లో కోట్లాది వ్యూస్ ను దక్కించుకున్న ఈ వెబ్ సిరీస్ కోసం తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు సీజన్ 2 కు సంబంధించిన ప్రోమో వచ్చేసింది. ప్రోమో చూస్తుంటే సీజన్ 2 అత్యంత ఆకర్షణీయంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మొదటి సీజన్ తో పోల్చితే రెండవ సీజన్ మరింత ఆకర్షణీయంగా మరియు రొమాంటిక్ కమ్ లవ్ సన్నివేశాలతో ఉండబోతున్నట్లుగా ప్రోమో చూస్తుంటే అనిపిస్తుంది. పృథ్వీ మరియు మేఘన ల మద్య రొమాన్స్ ను పీక్స్ లో చూపించడం ద్వారా యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నారు.
మొదటి సీజన్ లో ఇద్దరి మద్య గొడవలు మరియు వయసు తేడా వల్ల పృథ్వీ పడే ఇబ్బందులను చూపించడం జరిగింది. పెళ్లి అయ్యి ఫస్ట్ నైట్ కూడా పూర్తి అయిన మేఘన మరియు పృథ్వీల మద్య ఇక ముందు వయసు తేడా వల్ల వచ్చే విభేదాల.. ఆ విభేదాల కారణంగా రొమాన్స్ పై పడే ప్రభావం ఎలా ఉంటుంది అనేది చూపించే అవకాశాలు ఉన్నాయి. వయసు తేడా ఉండటం వల్ల ఖచ్చితంగా వైవాహిక జీవితంలో కొన్ని ఒడి దొడుకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఒడి దొడుకులు వారు ఎలా అధిగమించారు.. కొత్త జీవితంను వారు ఎలా కొనసాగించారు అనేది సీజన్ 2 లో చూస్తామని అంటున్నారు.పదేళ్ల వయసు తేడా ఉన్న అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది..
తద్వారా జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మరింత డెప్త్ గా చూపించడం కోసం మేకర్స్ సీజన్ 2 ను ప్లాన్ చేస్తున్నారు. ఎక్కువ గొడవ పడకుండా పృథ్వీ మరియు మేఘనల మద్య లవ్ కమ్ రొమాంటిక్ సన్నివేశాలను ఎక్కవగా చూపించడం వల్ల యూత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రోమో విడుదల చేయగానే వచ్చిన వ్యూస్ ను చూస్తుంటే ఏ స్థాయిలో ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పలువురు ఫిల్మ్ మేకర్స్ మరియు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ పై ఆసక్తి చూపించారు. ఆ సమయంలో చాలా మంది ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు సీజన్ 2 కోసం వారు కూడా ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.