Home » Exclusive » Dog Video Viral In Social Media 2
Exclusive

Viral Video : ఇందుకే అందరూ తమ ఇంట్లో కుక్కలు పెంచుకోవాలి.. అది ఏం చేసిందో చూడండి..

Authored By
mallesh
The Telugu News | Published on: February 1, 2022, 4:00 pm
Advertisement

Viral Video : విశ్వాసానికి ప్రతీక అయిన ‘డాగ్’ గురించి అందరికీ తెలుసు. కుక్క తన యజమాని పట్ల చూపే ప్రేమ, గౌరవం గురించి అందరూ చూసే ఉంటారు. కాగా, అలా తన యజమాని కోసం కుక్కలు పరితపించడానికి సంబంధించిన బోలెడన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఓ యూనిక్ వీడియో ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూస్తే మీ మనసు ఆనందంతో ఉప్పొంగుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Advertisement

ఇటీవల కాలంలో దాదాపుగా ప్రతీ ఒక్కరు తమ ఇంట్లో పెట్ యానిమల్ గా కుక్కలను పెంచుకుంటున్నారు. ఇకపోతే కుక్కలు తమ ఓనర్ పట్ల చూపే విశ్వాసం అసమానం అని చెప్పొచ్చు. అటువంటి ప్రేమను మనుషులు కూడా చూపలేరు. తాజాగా వైరలవుతున్న వీడియోలో కుక్క చాలా మంచి పని చేసింది. యోగ్ అనే ట్విట్టర్ యూజర్ ‘ఇందుకే అందరూ కుక్కలు కలిగి ఉండాలి’ అనే క్యాప్షన్ తో ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశాడు.

dog video viral in social media

Advertisement

Viral Video : యజమాని కోసం అంత పని చేసిన కుక్క..

సదరు వీడియోలో ఓనర్ ఓ టేబుల్ వద్ద తన బ్రేక్ ఫాస్ట్ చేస్తుంటాడు. అంతలోనే డాగ్ వచ్చేసి, ఓ పాత్రను తీసుకుని యజమాని వద్దకు వస్తుంది. అలా పాత్రను తీసుకొని వచ్చి టేబుల్ పైన పెట్టడంతో ఓనర్ అయిన ఆమె తన వద్ద ఉన్న రెండు పీస్‌ల ఆహార పదార్థాన్ని పాత్రలో వేసేస్తుంది. అయితే, కుక్క రెండూ తినకుండా ఒకటి మళ్లీ తిరిగి తన ఓనర్ ప్లేట్ లో వేసేస్తుంది. అది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ కుక్క ఇంటిలో సభ్యురాలై పోయిందని, గ్రేట్ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి