Prabhas : ఎయిర్ పోర్టులో ప్రభాస్ చెంప పగలగొట్టిన అమ్మాయి.. వైరల్ అవుతున్న వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : ఎయిర్ పోర్టులో ప్రభాస్ చెంప పగలగొట్టిన అమ్మాయి.. వైరల్ అవుతున్న వీడియో..!

 Authored By aruna | The Telugu News | Updated on :3 October 2023,9:00 pm

Prabhas : ‘ బాహుబలి ‘ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇక ప్రభాస్ తరచుగా ఎయిర్ పోర్ట్స్, ఈవెంట్స్ సమయాలలో అభిమానులతో క్లిక్ అవుతూ కనిపిస్తారు. అభిమానులు ఫోటోల కోసం అడిగిన నవ్వుతూ సెల్ఫీ ఇస్తాడు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ కు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ప్రభాస్ చెంపను చెల్లుమనిపించిన ఓ మహిళ అభిమాని విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ విజువల్స్ ఎయిర్ పోర్ట్ లో మీడియా చేతికి చిక్కాయి.

ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తున్న ప్రభాస్ ను చూసిన ఓ అమ్మాయి అతడితో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపించింది. దీంతో ప్రభాస్ ఆమెతో సెల్ఫీ దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే సెల్ఫీ దిగాక అమ్మాయి సరదాగా ప్రభాస్ చెంపపై కొట్టింది. దీంతో ప్రభాస్ చంపను తడుముకుంటూ చిన్నగా స్మైల్ ఇచ్చాడు. ఆ అమ్మాయి అభిమానంతో ఇలా చేసిందని చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం అయింది. అయితే వాస్తవానికి ఈ వీడియో 2019లో ఇంస్టాగ్రామ్ లో వైరల్ అయింది. అయితే మరోసారి ఈ వీడియో ఇలా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

A girl slapped prabhas in Airport

A girl slapped prabhas in Airport

ఇకపోతే సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ప్రభాస్ ‘ సలార్ ‘ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అత్యధిక భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుంది. ప్రభాస్ గత సినిమాలు సాహో, ఆది పురుష్ డిజాస్టర్ టాక్ ను తెచ్చుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు రాబోయే సలార్ సినిమాపై ప్రభాస్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ కి సరైన హిట్టు పడడం లేదు అభిమానులు కాస్త ఫీలవుతున్నారు. ఈ సినిమా అయినా ప్రభాస్ ఇమేజ్ ను హైప్ కి తీసుకెళుతుందో లేదో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది