Aamani : సౌంద‌ర్య‌కు ఎక్స్ పోజింగ్ అంటే అస్స‌లు న‌చ్చ‌దు.. ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన ఆమ‌ని

Authored By mallesh | The Telugu News | Published on: July 19, 2022, 12:00 pm

Aamani : ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ దివంగ‌త న‌టి సౌంద‌ర్యను ఇప్ప‌టికీ ప్రేక్ష‌కులు మ‌ర్చిపోలేరు. ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించి సినీరంగంలో చెర‌గ‌ని ముద్ర వేసింది. తెలుగుతో పాటు త‌మిల్, క‌న్న‌డ, మ‌ళ‌యాళ, హిందీ చిత్రాల్లో నటించింది. అద్బుత‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ గుండెల్లో నేటికి చిర‌స్థాయిగా నిలిచిపోయింది. టాలీవుడ్ లో అగ్ర‌హీరోలంద‌రితో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వెంకటేశ్ సరసన రాజా, జయం మనదేరా, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రశంసలందుకున్నారు. వీళ్ల ఇద్ద‌రి కాంబినేష‌న్ టాలీవుడ్ లోఅత్యంత విజయవంతమైన జంటగా చెప్పుకుంటారు.

కాగా సౌంద‌ర్య గ్లామ‌ర్ షోకి ఆమ‌డ దూరంలో ఉండేది. అందాల ఆర‌బోత ఆమెకి ఇష్టం ఉండేది కాదు. సాంప్ర‌దాయ చీర‌క‌ట్టులో అంద‌రినీ ఆక‌ట్టుకునేది. 12 ఏళ్ల పాటు సినీ ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగిన సౌంద‌ర్య ఎన్నో అవార్డులును అందుకుంది. కాగా 2004లో విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించింది. బీజేపీలో ప్ర‌చారంలో భాగంగా బెంగ‌ళూర్ నుంచి ఆంధ్ర‌ప‌దేశ్ వ‌స్తుండ‌గా ఈ ప్రమాదం జ‌ర‌గ‌డంతో అభిమానులంద‌రికీ దూరం అయ్యారు. వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్న త‌రుణంలో తోటి హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ చేస్తుండ‌గా సౌంద‌ర్య మాత్రం అలా చేయ‌లేదు. ఈ విష‌యాన్ని త‌న స్నేహితురాలు.. న‌టి ఆమ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇద్ద‌రికీ క‌న్న‌డ పాట‌లంటే ఎక్కువ ఇష్ట‌మ‌ని చెప్పింది.

Aamani about on Soundarya

Aamani about on Soundarya

Aamani : కుటుంబం కోసం..

కాగా ఇద్ద‌రూ క‌లిసిన‌ప్పుడు చిన్నపటి విషయాలు, ఫ్యూచర్ గురించి ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ల‌మ‌ని ఆమ‌ని అన్నారు. త‌ను సినిమాల్లో కొంతమేరకు ఎక్స్ పోజింగ్ చేసినా సౌందర్య మాత్రం గ్లామర్ షో దూరంగా ఉంద‌ని చెప్పింది. ఇదే విష‌య‌మై సౌంద‌ర్య‌ను అడిగితే.. ఎక్స్ పోజింగ్ ఎందుకు చేయాలే.. రేపు పెళ్లి అయితే త‌న భ‌ర్త‌కి కుటుంబానికి ఇబ్బందిగా ఉంటుంద‌ని అందుకే చేయ‌న‌ని చెప్పిన‌ట్లు ఆమ‌ని చెప్పుకొచ్చింది. ఇప్ప‌టికీ సౌంద‌ర్య ఉండి ఉంటే ఇంకా అద్బుత‌మైన పాత్ర‌లు పోషిస్తూ మెప్పించేద‌ని అన్నారు.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp