Aamani : ఆరుసార్లు అబార్ష‌న్.. న‌ర‌కం చూశానంటూ ఆమని స్ట‌న్నింగ్ కామెంట్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Aamani : ఆరుసార్లు అబార్ష‌న్.. న‌ర‌కం చూశానంటూ ఆమని స్ట‌న్నింగ్ కామెంట్స్..!

Aamani : ఆమ‌ని.. ఒకప్పుడు ఆమె స్టార్ హీరోయిన్. ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచింది. అప్పట్లో హోమ్లీగా కనిపిస్తూ మిడిల్ క్లాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. కుటుంబ కథా చిత్రాలంటే ఖచ్చితంగా ఆమని ఉండాల్సిందే అన్నట్లుగా ప్రేక్షకుల చేత ప్రశంసలు పొందారు. ముఖ్యంగా మావిచిగురు, శుభలగ్నం, జంబలకిడిపంబ, మిస్టర్ పెళ్లాం, శుభమస్తు, వంశానికొక్కడు, శుభసంకల్పం వంటి హిట్ చిత్రాలలో న‌టించింది.హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుతున్న దశలో పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలవ్వాలని […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 June 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Aamani : ఆరుసార్లు అబార్ష‌న్.. న‌ర‌కం చూశానంటూ ఆమని స్ట‌న్నింగ్ కామెంట్స్..!

Aamani : ఆమ‌ని.. ఒకప్పుడు ఆమె స్టార్ హీరోయిన్. ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచింది. అప్పట్లో హోమ్లీగా కనిపిస్తూ మిడిల్ క్లాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. కుటుంబ కథా చిత్రాలంటే ఖచ్చితంగా ఆమని ఉండాల్సిందే అన్నట్లుగా ప్రేక్షకుల చేత ప్రశంసలు పొందారు. ముఖ్యంగా మావిచిగురు, శుభలగ్నం, జంబలకిడిపంబ, మిస్టర్ పెళ్లాం, శుభమస్తు, వంశానికొక్కడు, శుభసంకల్పం వంటి హిట్ చిత్రాలలో న‌టించింది.హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుతున్న దశలో పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలవ్వాలని భావించింది. తమిళ నిర్మాత ఖాజా మోహియుద్దీన్‌ని వివాహం చేసుకుంది.

Aamani అంత న‌ర‌కం చూసిందా..

అంతా అనుకున్నట్లుగా వీరిది ప్రేమ వివాహం కాదు, పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా కాదు. కేవలం అభిప్రాయాలు కలవడంతోనే ఆమని- ఖాజాల పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు . వివాహం తర్వాత ఫ్యామిలీ లైఫ్‌కు అంకితమైన ఆమని, సినిమాలకు దూరమయ్యారు. ఆమ‌ని ఇటీవల మ్యూజిక్‌ షాప్‌ మూర్తి చిత్రంలో మెరిసింది ఆమని. ఇదిలా ఉంటే తన పర్సనల్‌ లైఫ్‌ గురించి షాకింగ్‌ విషయాలను బయటపెట్టింది ఆమని. తనకు ఏకంగా ఆరు ఆబార్షన్స్ అయినట్టు వెల్లడించింది. తాను హీరోయిన్‌గా చేసేటప్పుడు చాలా డైట్‌ చేసేదట. చాలా తక్కువగా తినేదట. మార్నింగ్ జస్ట్ జ్యూస్‌లు తాగేదట. తన డైట్‌ చూసి దాసరి నారాయణరావు కూడా తిట్టేవాడట. హెల్త్ విషయంలో ఎక్కువగా కాన్షియస్‌గా ఉండేదట. షూటింగ్‌ల్లో ఇబ్బంది పడకుండా ఉండేందుకు తాను ఆ జాగ్రత్తలు తీసుకునేదట.

Aamani ఆరుసార్లు అబార్ష‌న్ న‌ర‌కం చూశానంటూ ఆమని స్ట‌న్నింగ్ కామెంట్స్

Aamani : ఆరుసార్లు అబార్ష‌న్.. న‌ర‌కం చూశానంటూ ఆమని స్ట‌న్నింగ్ కామెంట్స్..!

అలా చేయ‌డంతో తనకు బ్లడ్‌ డెఫీషియన్సీ వచ్చిందట. ప్రోటీన్‌ ఎస్‌ అనేది తక్కువగా ఉండ‌డంతో పిల్లలు పుట్టలేదని, అలా తాను ఆరు సార్లు అబార్షన్‌ అయినట్టు చెప్పింది. తనకు ఎందుకు గర్భం నిలవడం లేదో అర్థం కాలేదని, డాక్టర్లు కూడా షాక్‌ అయ్యేవారని, ఓ డాక్టర్‌ మాత్రం ఏకంగా తన సమస్య అర్థం కాక తలపట్టుకుందని, నా కెరీర్‌లో ఇలాంటి కేసు చూడలేదని, మీ విషయంలో ఓడిపోయామని కూడా చెప్పారట. చివ‌ర‌కు ఓ డాక్ట‌ర్ మాత్రం త‌న స‌మ‌స్య‌ని గుర్తించార‌ట‌. సమస్యని గుర్తించాక ట్రీట్‌మెంట్‌ తీసుకున్నానని, ఆ తర్వాత సెట్‌ అయ్యిందని, పిల్లలు పుట్టినట్టు తెలిపింది ఆమ‌ని. ఈ విష‌యం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది