Actress : అది నా వీక్‌నెస్.. ఆ పని చేయకపోతే తట్టుకోలేనన్న సీనియర్ నటి
ప్రధానాంశాలు:
Actress : అది నా వీక్‌నెస్.. ఆ పని చేయకపోతే తట్టుకోలేనన్న సీనియర్ నటి
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం సృష్టించిన ఆమని.. ఆ తరువాత వెనక్కి తిరిగి చూడలేదు. వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ముఖ్యంగా శుభలగ్నం, మావిచిగురు లాంటి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని కట్టిపడేసింది.

Actress : అది నా వీక్‌నెస్.. ఆ పని చేయకపోతే తట్టుకోలేనన్న సీనియర్ నటి
Actress అది చేయాల్సిందే..
తమిళ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి అక్కడ తన రెండో సినిమాకి ప్రొడ్యూస్ చేసిన ప్రముఖ నిర్మాత ఖాజా మొయినుద్దీన్‌ని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఇక ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్ కూడా చేస్తూ సందడి చేస్తుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకే లేస్తానని.. నిద్రలేచిన వెంటనే స్నానం చేసి పూజ చేయడం మొదటి పని అని చెప్పుకొచ్చింది. పూజ చేయకుండా ఎక్కడికీ వెళ్లనని.. ఒకవేళ పూజ చేయకపోతే ఆ రోజంతా తన మనసు కలవరం చెందినట్టే ఉంటుందని చెప్పారు. లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదవడం, ఆ తర్వాత యోగా చేయడం తన డైలీ రొటీన్ అని వివరించారు