Jabardasth Nooka Raju : నూకరాజు రోగంపై సెటైర్లు..కౌంటర్లతో ఆగని ఆమని
Jabardasth Nooka Raju : జబర్దస్త్ కమెడియన్ నూకరాజు షుగర్ వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. తన రోగం మీద తానే ఎన్నో సెటైర్లు వేసుకుంటూ ఉంటాడు. ప్రతీ స్కిట్లో నూకరాజు తన రోగం మీద కచ్చితంగా కౌంటర్లు వేసుకుంటాడు. అయితే ఈ మధ్య నూకరాజు మాత్రం షోల్లో కనిపించడం లేదు. మధ్య మధ్యలో ఆ రోగం వల్ల గ్యాప్ ఇస్తున్నట్టున్నాడు.
శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్, రెచ్చిపోదాం బ్రదర్ వంటి షోల్లో నూకరాజు సందడి చేస్తుంటాడు. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో నూకరాజు రచ్చ చేశాడు. ఆమని వేసిన పంచ్‌లకు నూకరాజు షాక్ అయ్యాడు. విష్ణుప్రియని స్పెషల్ గెస్టుగా తీసుకొచ్చాడు. నిన్ను తీసుకున్న దాని కంటే నూకరాజు భార్యగా, ఫస్ట్ నైట్ అని చెప్పడంతో హ్యాపీగా ఫీలైనట్టున్నావ్ కదా? అని నూకరాజు అంటాడు.

Aamani Satires On Nooka Raju In Extra Jabardasth
Jabardasth Nooka Raju : నూకరాజుపై ఆమని సెటైర్లు..
అలా పంచ్‌లతో నూకరాజు రెచ్చిపోతోంటే.. ఆమని దుమ్ములేపేసింది. ఈ సారి నన్ను ఎవ్వరూ ఆపలేరు అని నూకరాజు అంటే.. నువ్వూ ఆగవు.. నీకు వచ్చిన రోగమూ ఆగదు అని ఆమని కౌంటర్ వేస్తుంటుంది. దీంతో నూకరాజు దెబ్బకు షాక్ అవుతాడు. మొత్తానికి నూకరాజు మాత్రం తన షుగర్ వ్యాధితో బాగానే బాధపడుతున్నట్టు కనిపిస్తోంది.
