Aamani : ఆరుసార్లు అబార్షన్.. నరకం చూశానంటూ ఆమని స్టన్నింగ్ కామెంట్స్..!
Aamani : ఆమని.. ఒకప్పుడు ఆమె స్టార్ హీరోయిన్. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచింది. అప్పట్లో హోమ్లీగా కనిపిస్తూ మిడిల్ క్లాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. కుటుంబ కథా చిత్రాలంటే ఖచ్చితంగా ఆమని ఉండాల్సిందే అన్నట్లుగా ప్రేక్షకుల చేత ప్రశంసలు పొందారు. ముఖ్యంగా మావిచిగురు, శుభలగ్నం, జంబలకిడిపంబ, మిస్టర్ పెళ్లాం, శుభమస్తు, వంశానికొక్కడు, శుభసంకల్పం వంటి హిట్ చిత్రాలలో నటించింది.హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుతున్న దశలో పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలవ్వాలని భావించింది. తమిళ నిర్మాత ఖాజా మోహియుద్దీన్‌ని వివాహం చేసుకుంది.
అంతా అనుకున్నట్లుగా వీరిది ప్రేమ వివాహం కాదు, పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా కాదు. కేవలం అభిప్రాయాలు కలవడంతోనే ఆమని- ఖాజాల పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు . వివాహం తర్వాత ఫ్యామిలీ లైఫ్‌కు అంకితమైన ఆమని, సినిమాలకు దూరమయ్యారు. ఆమని ఇటీవల మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రంలో మెరిసింది ఆమని. ఇదిలా ఉంటే తన పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టింది ఆమని. తనకు ఏకంగా ఆరు ఆబార్షన్స్ అయినట్టు వెల్లడించింది. తాను హీరోయిన్‌గా చేసేటప్పుడు చాలా డైట్ చేసేదట. చాలా తక్కువగా తినేదట. మార్నింగ్ జస్ట్ జ్యూస్‌లు తాగేదట. తన డైట్ చూసి దాసరి నారాయణరావు కూడా తిట్టేవాడట. హెల్త్ విషయంలో ఎక్కువగా కాన్షియస్‌గా ఉండేదట. షూటింగ్‌ల్లో ఇబ్బంది పడకుండా ఉండేందుకు తాను ఆ జాగ్రత్తలు తీసుకునేదట.
Aamani : ఆరుసార్లు అబార్షన్.. నరకం చూశానంటూ ఆమని స్టన్నింగ్ కామెంట్స్..!
అలా చేయడంతో తనకు బ్లడ్ డెఫీషియన్సీ వచ్చిందట. ప్రోటీన్ ఎస్ అనేది తక్కువగా ఉండడంతో పిల్లలు పుట్టలేదని, అలా తాను ఆరు సార్లు అబార్షన్ అయినట్టు చెప్పింది. తనకు ఎందుకు గర్భం నిలవడం లేదో అర్థం కాలేదని, డాక్టర్లు కూడా షాక్ అయ్యేవారని, ఓ డాక్టర్ మాత్రం ఏకంగా తన సమస్య అర్థం కాక తలపట్టుకుందని, నా కెరీర్‌లో ఇలాంటి కేసు చూడలేదని, మీ విషయంలో ఓడిపోయామని కూడా చెప్పారట. చివరకు ఓ డాక్టర్ మాత్రం తన సమస్యని గుర్తించారట. సమస్యని గుర్తించాక ట్రీట్‌మెంట్ తీసుకున్నానని, ఆ తర్వాత సెట్ అయ్యిందని, పిల్లలు పుట్టినట్టు తెలిపింది ఆమని. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
Kalpika Ganesh : హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ -కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్టులో కల్పిక నానా హంగామా…
Heart Attack : శరీరంలో కొన్ని వ్యాధులు కొన్ని సంకేతాలను తెలియజేస్తాయి. అయితే గుండె జబ్బులు మాత్రం శరీరానికి నిశ్శబ్దంగా…
YS Jagan NCLT : వైసీపీ YCP అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేషనల్ కంపెనీ…
Sreeleela : పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల, ఆ సినిమా విజయంతో ఒక్కసారిగా ప్రేక్షకుల…
kingdom Movie : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకి Vijay Devarakonda గీత గోవిందం తర్వాత ఆ రేంజ్ హిట్…
MPTC ZPTC Elections : ఆంధ్రప్రదేశ్‌లోని Andhra pradesh ఖాళీగా ఉన్నస్థానిక స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జూలై…
Banana : ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. ఈ రోజుల్లో అది సాధ్యం కావడం లేదు. పిల్లల దగ్గర…
Racha Ravi : 2013లో ప్రారంభమైన జబర్ధస్త్ షోతో మంచి పేరు తెచ్చుకున్న వారిలో రచ్చ రవి కూడా ఒకరు.…
This website uses cookies.