Aanand Devarakonda : బాలీవుడ్ హాట్ బ్యూటీతో రచ్చ.. ఆనంద్ దేవరకొండ మామూలోడు కాదు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 2 December 2021, 10:10 pm

Aanand Devarakonda : ఇటీవ‌ల పుష్ప‌క విమానం సినిమాతో మంచి విజ‌యం సాధించారు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ. ఆయ‌న హీరోగా కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్‌ థ్రిల్లర్ `హైవే`. ఈ సినిమాలో పూర్తిగా స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా వెంకట్‌ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో మీర్జాపూర్‌, పాతాళ్‌లోక్ వంటి సిరీస్‌ల‌తో తెలుగులోనూ ఫేమ‌స్ అయిన బాలీవుడ్ న‌టుడు అభిషేక్ బెన‌ర్జి కీల‌క‌పాత్ర పోషిస్తుండ‌గా బాలీవుడ్ హాట్ బ్యూటీ స‌యామీఖేర్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తోంది. భారీ అంఛ‌నాల‌తో రూపొందుతోన్న ఈ చిత్రం తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోని అద్భుత‌మైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌లో ఉన్నాయి. మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన న‌టీన‌టుల‌ కాన్సెప్ట్ పోస్ట‌ర్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

Aanand Devarakonda Romance with Saiyami Kher

Aanand Devarakonda Romance with Saiyami Kher

Aanand Devarakonda : బాలీవుడ్ హాట్ బ్యూటీతో రచ్చ

చిత్ర నిర్మాత వెంకట్‌ తలారి మాట్లాడుతూ – ‘‘118 వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన గుహ‌న్ గారి ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ దేవ‌ర‌కొండ, మాన‌స రాధా కృష్ణ‌న్ హీరో హీరోయిన్లుగా హైవే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్ట‌ర్స్ అభిషేక్ బెన‌ర్జి, స‌యామీఖేర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మా బ్యాన‌ర్లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెర‌కెక్కించాం. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు చివ‌రిదశ‌లో ఉన్నాయి“ అన్నారు. చిత్ర దర్శకుడు కేవీ గుహన్‌ మాట్లాడుతూ – ‘‘ఒక‌రితో ఒక‌రికి సంభంధం లేని న‌లుగురు వ్య‌క్తుల క‌థే `హైవే’ . పూర్తిగా హైవే నేప‌థ్యంలోనే సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌. టెక్నిక‌ల్ ప‌రంగా హై స్టాండ‌ర్డ్‌లో ఉంటుంది“ అన్నారు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి