Rashmika Mandanna : రష్మిక, విజయ్ రిలేషన్ ను బయట పెట్టేసిన ఆనంద్.. ఆ ప్రశ్న వేయడంతో షాక్..!
Rashmika Mandanna : ఆనంద్ దేవరకొండ ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. బేబీ సినిమాతో చాలా పెద్ద హిట్ అందుకున్న ఆయన.. ఇప్పుడు గం గం గణేశ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించాడు. మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. దానికి రష్మిక మందన్నా చీఫ్ గెస్ట్ గా హాజరైంది. ఇందులో రష్మికను ఆనంద్ కొన్ని ప్రశ్నలు వేశాడు. మధ్యలో ఆమెను ఇరికించే ప్రశ్నలు కూడా వేశాడు. ఆ మధ్య రష్మికా మండన్న కొన్ని పెట్ డాగ్స్ తో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
Rashmika Mandanna ఇద్దరి నడుమ రూమర్లు..
దాంతో వాటి గురించి అడిగాడు ఆనంద్. ఆమె మాట్లాడుతూ.. నాకు నా పెట్ డాగ్ ఆరా మొదటి బేబీ. విజయ్ దేవరకొండ పెట్ డాగ్ రెండో బేబీ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆమె విజయ్ పేరు అడగకపోయినా చెప్పడంతో ఆ ప్రాంతంలో కేకలతో హోరెత్తిపోయింది. ఎందుకంటే చాలా కాలంగా విజయ్ కు రష్మికకు మధ్య ఏదో రిలేషన్ నడుస్తుందని ఎప్పటి నుంచో రూమర్లు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండటం కూడా హాట్ టాపిక్ అయిపోతోంది. కానీ వారి రిలేషన్ పై వారు ఇప్పటి వరకు ఎన్నడూ నేరుగా స్పందించలేదు.

Rashmika Mandanna : రష్మిక, విజయ్ రిలేషన్ ను బయట పెట్టేసిన ఆనంద్.. ఆ ప్రశ్న వేయడంతో షాక్..!
ఇక తాజాగా ఆనంద్ నీకు ఇష్టమైన ట్రావెల్ ప్లేస్ ఏంటి అని అడిగాడు. దానికి రష్మిక మాట్లాడుతూ.. వియత్నాం అని చెప్పింది. తర్వాత నీకు ఇష్టమైన కో స్టార్ ఎవరు అని అడిగాడు. దాంతో ఆమె ఇరకాటంలో పడిపోయింది. అరేయ్ ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీరా.. ఇలా అందరి ముందు ఇలా స్పాట్‌లో పెడితే ఎట్లా’ అని సరదాగా తిట్టింది. తర్వాత రౌడీ బాయ్ (విజయ్ దేవరకొండ) అని చెప్పింది. ఇంకేముంది అక్కడ అంతా కేకలు, అరుపులతో దద్దరిల్లిపోయింది. ఇక ఆనంద్ తన టాటూ గురించి కూడా మాట్లాడాడు. తాను పుష్పలో శ్రీవల్లి ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు. అందుకే శ్రీవల్లి అనే పేరు వేయించుకున్నా అని చెబుతాడు. అలాగే మరో కొన్ని ప్రశ్నలు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.