Highway Movie Review : ఆనంద్ దేవ‌ర‌కొండ హైవే మూవీ ఫ‌స్ట్ రివ్యూ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Highway Movie Review : ఆనంద్ దేవ‌ర‌కొండ హైవే మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!

Highway Review: ఆహా ఈమ‌ధ్య‌ ఒరిజినల్ కంటెంట్ పై దృష్టి పెట్టింది. ఆ క్ర‌మంనే ఆహా నుంచి ఓ సైకో థ్రిల్లర్ వచ్చింది. అదే.. హైవే. ఆనంద్ దేవరకొండ, సయామీ ఖేర్ లాంటి స్టార్ కాస్ట్ వుంది. అలాగే పాతాల్ లోక్ సిరిస్ తో ఆకట్టుకున్న అభిషేక్ బెనర్జీ కూడా వున్నాడు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా అపార‌మైన అనుభ‌వం ఉన్న‌.. కెవి గుహ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. 118 లాంటి మంచి సినిమా ఆయ‌న్నుంచే వ‌చ్చింది. కాబ‌ట్టి… ఈ సినిమాపై కాస్త […]

 Authored By sandeep | The Telugu News | Updated on :19 August 2022,1:00 pm

Highway Review: ఆహా ఈమ‌ధ్య‌ ఒరిజినల్ కంటెంట్ పై దృష్టి పెట్టింది. ఆ క్ర‌మంనే ఆహా నుంచి ఓ సైకో థ్రిల్లర్ వచ్చింది. అదే.. హైవే. ఆనంద్ దేవరకొండ, సయామీ ఖేర్ లాంటి స్టార్ కాస్ట్ వుంది. అలాగే పాతాల్ లోక్ సిరిస్ తో ఆకట్టుకున్న అభిషేక్ బెనర్జీ కూడా వున్నాడు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా అపార‌మైన అనుభ‌వం ఉన్న‌.. కెవి గుహ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. 118 లాంటి మంచి సినిమా ఆయ‌న్నుంచే వ‌చ్చింది. కాబ‌ట్టి… ఈ సినిమాపై కాస్త దృష్టి పెట్టొచ్చ‌నిపించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం.

Highway Movie Review క‌థ‌

విష్ణు(ఆనంద్ దేవరకొండ) ఒక ఫోటోగ్రాఫర్ తన జాబ్ కోసం అని బెంగళూర్ కి స్టార్ట్ అవుతాడు. అలాగే మరోపక్క తులసి(మానస రాధాకృష్ణన్) తన తల్లితో ఓ పౌల్ట్రీ ఫామ్ లో పనిచేస్తుంది. కానీ అక్కడ తన ఓనర్ వేధింపులు చూడలేక అక్కడ నుంచి పారిపోతుంది.. మరో పక్క ఓ సీరియల్ కిల్లర్ డి అలియాస్ దాస్(అభిషేక్ బెనర్జీ) వరుసగా 5 హత్యలు అందులోని ఆడవాళ్లనే చంపుతాడు. మరి దీనితో అతన్ని పట్టుకోవాలని పోలీసులు తీవ్రంగా గాలిస్తూ ఉంటారు. అటు దాస్, తులసి లు ఇటు ఈ సైకో.. మరి ఈ ముగ్గురు ఎక్కడైనా ఎదురవుతారా? ఎదురైతే ప‌రిస్థితి ఏంటి అన్న‌ది ఆహాలో చూడాల్సిందే.

Highway Movie Review and rating in telugu

Highway Movie Review and rating in telugu

సైకో కిల్లర్ చిత్రాలకు కి ఒక టెంప్లెట్ ఉంటుంది. ఒక సైకో… తన సైకో సాటిస్ఫెక్షన్ కోసం ఒకే మోడల్ లో హ‌త్య‌లు చేస్తుంటాడు. తనని పట్టుకోవాలని చూసే వారికి సవాళ్ళు విసురుతుంటాడు. చివరికి పట్టుబడతాడు. దాదాపు ఇదే టెంప్లెట్. హైవే కూడా ఇదే తీరులో సాగుతుంది. అసలు సైకో ఎవరో రివిల్ చేయడమే ఇలాంటి సినిమాల్లో కిక్ ఇచ్చే పాయింట్. ఇందులో మాత్రం ఎలాంటి మలుపులు లేకుండానే సైకోని రివిల్ చేశారు. దాంతో.. అస‌లు ట్విస్టు ఇంకేదో ఉంద‌న్న భ్ర‌మ క‌ల్పిస్తాడు.

సినిమా మెయిన్ గా మూడు ప్రధాన పాత్రల మీద నడుస్తుంది. హీరో హీరోయిన్ అలాగే కిల్లర్ పాత్రలు ఆధ్యంతం ఆకట్టుకుంటాయి. ఆనంద్ దేవరకొండ అలాగే యంగ్ హీరోయిన్ మానస రాధా కృష్ణన్ ఆకట్టుకుంటారు. ఆనంద్ నుంచి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో సినిమా ఇది. తాను ఇంతకు ముందు చేసిన వాటికన్నా మంచి మెచ్యూర్ రోల్ లో తాను కనిపించి ఆకట్టుకుంటాడు. అలాగే మానస రాధాకృష్ణన్ పవన్ ఫ్యాన్స్ కి బాగా తెలిసి ఉండొచ్చు.. అభిషేక్ బెనర్జీ అయితే తన సైకో పాత్రలో ఇంటెన్స్ పెర్ఫామెన్స్ ని చూపించాడు. తనదైన మ్యానరిజమ్స్.. నటనతో థ్రిల్ చేసాడు. ఇక సైయామి ఖేర్ తదితరులు సినిమాలో తమ పాత్రలకి బ్యాయం చేకూర్చారు.

నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక టెక్నీకల్ టీం లో అయితే సైమన్ కే ఇచ్చిన పాటలు పర్వాలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి తగ్గట్టుగా ఓ రేంజ్ లో అనిపిస్తుంది. అలాగే డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు.. ఇక సినిమాటోగ్రఫీ మరియు దర్శకత్వం వహించిన కేవీ గుహన్ విషయానికి వస్తే…సినిమాటోగ్రాఫర్ తాను మంచి వర్క్ ని అందించాడు. ఇక దర్శకునిగా కూడా పర్వాలేదని చెప్పొచ్చు.

చివ‌రిగా.. రొటీన్ టెంప్లెట్ తోనే హైవే ప్రయాణం చేయడానికి మొగ్గు చూపడం కొంత నిరాశని కలిగిస్తుంది.ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి త‌ప్ప‌క బోరింగ్ క‌లిగిస్తుంది. సినిమాలో కొత్త ద‌నం ట్రై చేయాల్సి ఉండ‌గా, రొటీన్‌గా చేయించిన‌ట్టు తెలుస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది