#image_title
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకూ రంజుగా మారుతోంది. చాలా ఆసక్తిగా మారుతోంది. ఇదివరకు సీజన్లు అన్నీ ఒక ఎత్తు అయితే.. ఈ సీజన్ మరో ఎత్తు. అవును.. ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచే మామూలు రచ్చ కాదు. రోజురోజుకూ ఈ షో మీద ఆసక్తి పెరిగిపోతోంది. ప్రతి క్షణం ఏమవుతుందా అని అందరూ టెన్షన్ పడుతున్నారు. హౌస్ లో గేమ్స్ కూడా బాగా ఆడుతున్నారు. ఎవరి మైండ్ గేమ్ వారిది. బిగ్ బాస్ కూడా బీభత్సమైన టాస్కులు ఇస్తున్నాడు. అలాగే.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు పెడుతున్నాడు. ఒక్కొక్కరు అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా గేమ్ ఆడుతున్నారు. ఎవరి గేమ్ వారిది. ఏమాత్రం తేడా వచ్చినా డైరెక్ట్ గా కడిగేస్తున్నారు. బిగ్ బాసు.. ఇది కదా అసలు ప్రేక్షకులకు కావాల్సింది అంటున్నారు ప్రేక్షకులు.
#image_title
అయితే.. ఆట సందీప్ జస్ట్ లో నామినేషన్స్ ను మిస్ అయ్యాడు. ఎందుకంటే.. తన పవరాస్త్రను పోగొట్టుకున్నాడు. అది లేకపోవడంతో ఏం చేయాలో తనకు అర్థం కాలేదు. ఎందుకంటే.. పవరాస్త్ర ఎవరి దగ్గర ఉంటే వాళ్లే పవర్ ఫుల్. అది ఉంటేనే 5 వారాల పాటు నామినేషన్లలో ఉండరు. అందుకే తన పవరాస్త్ర మిస్ అయింది అనగానే చాలా టెన్షన్ పడ్డాడు. శుభశ్రీ, దామిని ఇద్దరూ కలిసి ఆట సందీప్ పవరాస్త్రను దాచేశారు. కానీ.. దాన్ని సరిగ్గా దాచేయకపోవడంతో చివరకు అది వాళ్లకే తిరిగి దొరుకుతుంది. అమర్ దీప్ దాన్ని కనిపెట్టి తిరిగి సందీప్ కు అందిస్తాడు.
అయితే.. తన పవరాస్త్ర పోవడంతో ఎవరు తీశారో చెప్పండి అని అడుగుతాడు సందీప్. దీంతో ఎవ్వరూ చెప్పరు. శోభా కొంచెం ఆవేశపడి నాకు వాళ్ల టీమ్ మీదనే డౌట్. మహాబలి టీమ్ లోనే ఎవరో తీసి ఉంటారు అంటుంది శోభ. దీంతో రతికకు కోపం వచ్చి సెన్స్ ఉండి మాట్లాడుతున్నావా? అని అంటుంది రతిక. దీంతో సెన్స్ గిన్స్ అని మాట్లాడకు అంటూ శోభ కూడా సీరియస్ అవుతుంది. ఏది ఏమైనా రతిక హౌస్ లో చాలా కోపంతో మాట్లాడుతుంది. కోపంతో రతిక అలా మాట్లాడటంతో శోభాశెట్టికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మొత్తానికి బిగ్ బాస్ మాయాస్త్ర విషయంలో మరో పెద్ద టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ తో ఇంట్లో మళ్లీ గొడవలు ప్రారంభం అయ్యాయనే చెప్పుకోవచ్చు.
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
This website uses cookies.