Bigg Boss Telugu 7 : పవరాస్త్రను తిరిగి పొందిన ఆట సందీప్.. నామినేషన్స్ నుంచి ఎస్కేప్.. సెన్స్ ఉందా అంటూ శోభాశెట్టికి రతిక వార్నింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss Telugu 7 : పవరాస్త్రను తిరిగి పొందిన ఆట సందీప్.. నామినేషన్స్ నుంచి ఎస్కేప్.. సెన్స్ ఉందా అంటూ శోభాశెట్టికి రతిక వార్నింగ్

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకూ రంజుగా మారుతోంది. చాలా ఆసక్తిగా మారుతోంది. ఇదివరకు సీజన్లు అన్నీ ఒక ఎత్తు అయితే.. ఈ సీజన్ మరో ఎత్తు. అవును.. ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచే మామూలు రచ్చ కాదు. రోజురోజుకూ ఈ షో మీద ఆసక్తి పెరిగిపోతోంది. ప్రతి క్షణం ఏమవుతుందా అని అందరూ టెన్షన్ పడుతున్నారు. హౌస్ లో గేమ్స్ కూడా బాగా ఆడుతున్నారు. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :15 September 2023,11:00 am

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకూ రంజుగా మారుతోంది. చాలా ఆసక్తిగా మారుతోంది. ఇదివరకు సీజన్లు అన్నీ ఒక ఎత్తు అయితే.. ఈ సీజన్ మరో ఎత్తు. అవును.. ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచే మామూలు రచ్చ కాదు. రోజురోజుకూ ఈ షో మీద ఆసక్తి పెరిగిపోతోంది. ప్రతి క్షణం ఏమవుతుందా అని అందరూ టెన్షన్ పడుతున్నారు. హౌస్ లో గేమ్స్ కూడా బాగా ఆడుతున్నారు. ఎవరి మైండ్ గేమ్ వారిది. బిగ్ బాస్ కూడా బీభత్సమైన టాస్కులు ఇస్తున్నాడు. అలాగే.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు పెడుతున్నాడు. ఒక్కొక్కరు అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా గేమ్ ఆడుతున్నారు. ఎవరి గేమ్ వారిది. ఏమాత్రం తేడా వచ్చినా డైరెక్ట్ గా కడిగేస్తున్నారు. బిగ్ బాసు.. ఇది కదా అసలు ప్రేక్షకులకు కావాల్సింది అంటున్నారు ప్రేక్షకులు.

aata sandeep gets back his powerashtra in bigg boss telugu 7

#image_title

అయితే.. ఆట సందీప్ జస్ట్ లో నామినేషన్స్ ను మిస్ అయ్యాడు. ఎందుకంటే.. తన పవరాస్త్రను పోగొట్టుకున్నాడు. అది లేకపోవడంతో ఏం చేయాలో తనకు అర్థం కాలేదు. ఎందుకంటే.. పవరాస్త్ర ఎవరి దగ్గర ఉంటే వాళ్లే పవర్ ఫుల్. అది ఉంటేనే 5 వారాల పాటు నామినేషన్లలో ఉండరు. అందుకే తన పవరాస్త్ర మిస్ అయింది అనగానే చాలా టెన్షన్ పడ్డాడు. శుభశ్రీ, దామిని ఇద్దరూ కలిసి ఆట సందీప్ పవరాస్త్రను దాచేశారు. కానీ.. దాన్ని సరిగ్గా దాచేయకపోవడంతో చివరకు అది వాళ్లకే తిరిగి దొరుకుతుంది. అమర్ దీప్ దాన్ని కనిపెట్టి తిరిగి సందీప్ కు అందిస్తాడు.

Bigg Boss Telugu 7 : సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా అని శోభాశెట్టిని అన్న రతిక

అయితే.. తన పవరాస్త్ర పోవడంతో ఎవరు తీశారో చెప్పండి అని అడుగుతాడు సందీప్. దీంతో ఎవ్వరూ చెప్పరు. శోభా కొంచెం ఆవేశపడి నాకు వాళ్ల టీమ్ మీదనే డౌట్. మహాబలి టీమ్ లోనే ఎవరో తీసి ఉంటారు అంటుంది శోభ. దీంతో రతికకు కోపం వచ్చి సెన్స్ ఉండి మాట్లాడుతున్నావా? అని అంటుంది రతిక. దీంతో సెన్స్ గిన్స్ అని మాట్లాడకు అంటూ శోభ కూడా సీరియస్ అవుతుంది. ఏది ఏమైనా రతిక హౌస్ లో చాలా కోపంతో మాట్లాడుతుంది. కోపంతో రతిక అలా మాట్లాడటంతో శోభాశెట్టికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మొత్తానికి బిగ్ బాస్ మాయాస్త్ర విషయంలో మరో పెద్ద టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ తో ఇంట్లో మళ్లీ గొడవలు ప్రారంభం అయ్యాయనే చెప్పుకోవచ్చు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది