Acharya : చిరంజీవి, రామ్ చరణ్‌ల మంచి మనసు.. బయ్యర్స్‌కి పాతిక కోట్లు ఇచ్చారా..!
Acharya : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాగా, చిత్రం దారుణంగా నిరాశపరచింది. ఈ చిత్రం వల్ల బయ్యర్లకు భారీగా నష్టపోయారు. దీంతో నష్టపోయిన వారికి సెటిల్ చేయాల్సి వచ్చింది. అయితే ‘ఆచార్య’ సినిమా బిజినెస్ మరియు మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకున్న కొరటాలే నష్టపరిహారం చెల్లించే బాధ్యత తీసుకున్నారని ప్రచారం జరిగింది. సినిమాకు నష్టమొస్తే నిర్మాతలు భరించాలి కానీ..
మొత్తం దర్శకుడి మీదే భారం మోపడం ఎంతవరకు సమంజసమని కామెంట్స్ చేసారు.అయితే ‘ఆచార్య’ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం చిరంజీవి – రామ్ చరణ్ – కొరటాల రెమ్యునరేషన్ తీసుకోలేదని నిర్మాత స్వయంగా చెప్పారు. పారితోషికం తీసుకోకుండానే మెగా తండ్రీకొడుకులు ఇద్దరూ దాదాపు 175 రోజులు పనిచేశారని తెలుస్తోంది. అందుకుగానూ బ్యానర్ పేరు వేసుకుని ప్రాఫిట్స్ లో షేర్ తీసుకునేలా అగ్రిమెంట్ చేసుకొని ఉండొచ్చని అందరూ భావించారు.
Acharya : మెగా సాయం..
చేతి ఖర్చుల కోసం మాత్రమే కొంత తీసుకున్నామని కొరటాల సైతం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఇప్పుడు నష్టాలు రావడంతో అందరూ దర్శకుడి వెంట పడుతున్నారని అంటున్నారు. కాకపోతే ఈ సెటిల్ మెంట్ విషయంలో చిరు – చరణ్ ఎందుకు కలుగజేసుకోలేదనే దానిపైనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ వాస్తవానికి ‘ఆచార్య’ హీరోలిద్దరూ తమ బాధ్యతగా తిరిగి చెల్లింపులు చేశారని సమాచారం. చిరంజీవి – రామ్ చరణ్ కలిసి దాదాపు రూ.25 కోట్లు తిరిగి ఇచ్చారట. ఈ మొత్తం నుంచే చాలా మంది డిస్ట్రిబ్యూటర్ల ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసారని టాక్ వినిపిస్తోంది. ‘వినయ విధేయ రామ’ సినిమా టైంలో రామ్ చరణ్ తన రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసాడనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.