Acharya : మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ఆచార్య మూవీ రిలీజ్ డేట్స్ ఫిక్స్!
Acharya : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మొన్నటివరకు సంక్రాంతి బరిలో నిలుస్తుందని అంతా భావించారు. కానీ అనుకోకుండా పోస్టుపోన్ అవ్వడంతో మెగాస్టార్ అభిమానులు ఎంతో నిరాశకు గురయ్యారు. అయితే, ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఆచార్య సినిమాను ఉగాది పండుగ సమయంలో విడుదల చేయనున్నట్టు మూవీ మేకర్స్ ఎట్టకేలకు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై కనిపించక రెండేళ్లు సమయం గడిచిపోయింది. దీనంతటికి కొవిడ్ మహమ్మారి కారణంగా తెలుస్తోంది.కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఇందులో మెగాపవర్స స్టార్ రాంచరణ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు.
Acharya : ఉగాది పండుగ ఫైనలా..?
తండ్రి కొడుకులు ఇద్దరూ నక్సలైట్లుగా కనిపించనున్నారని టాక్. దీనికి సంబంధించి ఇప్పటికే పలు పోస్టర్లు, వీడియా గ్లిప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆచార్య సినిమాలో ముద్దుగుమ్మ కాజల్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక సాంగ్‌లో సీనియర్ నటి సంగీత అండ్ కాజల్ కనిపించగా.. మరో స్పెష్‌ల్ సాంగ్‌లో నటి రెజీనా కసాండ్ర చిరుతో కలసి స్టెప్పులేసింది.ఆచార్య మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు నిర్మాతలు. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. స్టోరీ పరంగా చూసుకున్నట్టైతే దేవాదాయ భూముల కబ్జా గురించి ఈ సినిమా ప్రధానంగా సాగుతుందని ఫిలిం వర్గాల టాక్.

acharya movie release dates fix April First
అన్యాయాన్న ఎదురించేందుకు తండ్రి కొడుకులు నక్సలైట్లుగా మారుతారని వార్తలు వస్తున్నాయి. గతేడాదే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్య సినిమా.. విడుదల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎట్టకేలకు ఉగాది పండుగ నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదిన బిగ్ స్క్రీన్లపై ఆచార్య సినిమాను చూడొచ్చని చిత్ర బృందం ట్విట్టర్ వేదికగా చిరు సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ తేది నాడు మెగాస్టార్ చిరు థియేటర్లకు వస్తారా? మళ్లీ వాయిదా వేస్తారా? అనేది వేచిచూడాల్సిందే.