
Actor Abbas doing work in Petrol Bunk
Actor Abbas : ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. కెరీర్‌లో ఓ వెలుగు వెలిగి ఉన్నత స్థానాలలో నిలిచిన వారు కూడా కొన్ని పరిస్థితుల వలన అనేక ఇబ్బందులు పడ్డారు. నటీనటులు.. పడిలేచే కెరటంలా.. హిట్ ప్లాప్ లను, ఒత్తిడిని పరాజయాన్ని అన్నిటి తట్టుకుంటూ.. కెరీర్ ను కొనసాగిస్తారు. ఇంకొందరు.. ఎగసి పడిన కెరటంలా.. తమకు వచ్చిన ఫేమ్ ని, అభిమానాన్ని తక్కువ సమయంలో కోల్పోయి.. కెరీర్ ను , సంపాదనను కోల్పోయి అయ్యో పాపం అనిపించేలా జీవిస్తారు. ప్రేమ దేశం హీరో అబ్బాస్ జీవితం పడిలేచిన కెరటం అనే చెప్పాలి. ఆయన జీవితం ఎలా మారిందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. అబ్బాస్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. యూత్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుని.. హ్యాండ్సమ్ లుక్‌తో అమ్మాయిలలో ఫాలోయింగ్ సంపాదించుకున్న అబ్బాస్ అమ్మాయిల కలల రాణిగా మారాడు. తరుణ్, ఉదయ్ కిరణ్, వడ్డే నవీన్, అబ్బాస్, అజిత్, అరవింద్ స్వామి.. ఇలా చాలా మంది స్టార్స్ అప్పట్లో స్టార్ డమ్ అందుకున్నారు. ముఖ్యంగా వీరిలో తెలుగుతోపాటు.. తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నవారిలో.. అజిత్, అబ్బాస్ అరవింద్ స్వామి ముగ్గురు టాప్.
ప్రస్తుతం ఈ ముగ్గురిలో అజిత్ స్టార్ హీరోగా రాణిస్తుండగా.. అరవింద్ స్వామి విలన్ పాత్రలలో అదరగొడుతున్నాడు. కానీ అబ్బాస్ మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే అమ్మాయిల మనసు కొల్లగొట్టిన అబ్బాస్ సినిమాల నుంచి దూరమైన తర్వాత అనేక కష్టాలు పడ్డాడట. ఈయన హెయిర్ స్టైల్‌కు చాలా మంది ఫాలోయర్స్ ఉండే వాళ్లు. తొలి సినిమాతోనే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోల్లో అబ్బాస్ కూడా ఒకరు. 1996లో వచ్చిన కాదల్ దేశం సినిమాతో పరిచయం అయ్యారు ఈయన. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. వెస్ట్ బెంగాల్‌లోని హౌరాలో పుట్టిన అబ్బాస్.. తమిళ, తెలుగు సినిమాలతోనే పాపులర్ అయ్యారు. ప్రేమ దేశం సినిమా తెలుగులోనూ సంచలన విజయం సాధించి ఈయన్ని స్టార్‌గా మార్చేసింది. ఆ తర్వాత ఏడాది 1997లో ప్రియా ఓ ప్రియా సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.
Actor Abbas doing work in Petrol Bunk
అబ్బాస్ ప్రధాన పాత్రలో నటించిన ప్రియా ఓ ప్రియా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగు చిత్రపరిశ్రమలో అబ్బాస్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయితే కొంతకాలం తర్వాత అబ్బాస్ వరుస పరాజయాలను చవి చూశాడు. ఆయన నటించిన రాజహంస, శ్వేతనాగు సినిమాలు ఆశించనంత హిట్ కాలేదు. దీంతో అబ్బాస్ పూర్తిగా తమిళ్, మలయాళ సినిమాలవైపు వెళ్లాడు. అక్కడ కూడా అబ్బాస్ నటించిన చిత్రాలు అంతగా హిట్ కాలేదు. దీంతో ఆయన సినిమాలకు దూరంగా న్యూజిలాండ్ వెళ్లాడు. అక్కడ కొంత కాలం పెట్రోల్ బంకులో పని చేసి.. బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన పనులకు వెళ్లాడు. ఇక అక్కడ పనిచేసిన అనుభవంతో ప్రస్తుతం అదే రంగంలో కొనసాగుతున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న అబ్బాస్.. తన జీవితంలో ఎదుర్కోన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.
భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పనిచేశాడు. అప్పుడే అక్కడ కనస్ట్రక్షన్ పనిపై పూర్తిగా పట్టు సంపాదించాడు. మెల్లగా బిల్డర్ గా మారాడు. క్రమంగా న్యూజిలాండ్ లో మంచి బిల్డర్ గా పేరు తెచ్చుకున్నాడు. అక్కడే స్థిరపడిపోయారు. జీవితంలో సక్సెస్ కు షార్ట్ కట్స్ ఉండవు.. అదే విధంగా ఒక చోట దారులు మూసుకుపోతే.. మరొక దారి తెరుచుకుంది.. దానిని అందిపుచ్చుకుని జీవితంలో ముందుకు వెళ్లడమే ముఖ్యమని అబ్బాస్ జీవితం చుస్తే ఎవరికైనా అనిపించక మానదు. ఒకప్పుడు నటుడిగా, మోడల్‌గా అభిమానులను సొంతం చేసుకున్న అబ్బాస్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్‌గా మారిపోయారు. ఇది కూడా ఓ ఉద్యోగమే. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఇదే చేస్తున్నారు ఈయన. మోటివేషనల్ స్పీచ్‌లు ఇస్తూ.. ఎవరికి ఏ సలహాలు కావాల్సినా కూడా తనదైన శైలిలో అందిస్తున్నారు అబ్బాస్. అలాగే భవన నిర్మాణ బిజినెస్ కూడా చేస్తున్నాడు ఈయన.
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
This website uses cookies.