Kaushik : సోషల్ మీడియాలో భార్య అలా చేసిందట.. గుట్టు విప్పిన సీరియల్ హీరో కౌశిక్

Authored By Cinema Desk | The Telugu News | Published on: November 19, 2021, 7:15 am

Kaushik : కౌశిక్ బాలనటుడిగా వెండితెరపై కనిపించాడు. ఆ తర్వాత సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక్కప్పుడు సీరియల్స్‌లో స్టార్‌గా ఉన్నాడు. చాలా సీరియస్‌లో హీరోగా మెప్పించాడు. అయితే సినిమాల్లో హీరోగా ఎంట్రీగా ఇద్దామని అనుకన్న ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో క్యారెక్ట్ ఆర్టిస్ట్‌గా చేశారు. సీరియల్స్‌ ద్వారా కౌశిక్‌ భారీ అభిమానులనే సంపాదించుకున్నారు.

అయితే గత కొంతకాలంగా మాత్రం కౌశిక్‌.. సీరియల్స్‌లో పెద్దగా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు మరోసారి బుల్లితెరపై సందడి చేస్తున్నాడు. హీరోగా కాకుండా ఒకటి, రెండు సీరియల్స్‌లో కీలక రోల్స్‌ పోషిస్తున్నాడు. అయితే తాజాగా ఈటీవీ ప్లస్‌లో ప్రసారమయ్యే రెచ్చిపోదాం బ్రదర్ షోకు వచ్చాడు. అందులో కౌశిక్ తనదైన శైలిలో కామెడీ పండించాడు. సోషల్ మీడియా ప్రస్తుతం జరగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయో చెప్పుకొచ్చాడు.

Actor Kaushik interesting comments on wife social media posts

Actor Kaushik interesting comments on wife social media posts

Kaushik : భార్యపై కౌశిక్ కామెంట్లు

ఈ షోలో భాగంగా టెస్టీ తేజ.. సోషల్ మీడియాలో అమ్మాయిలకు క్రేజ్ మామూలుగా లేదు అని అంటాడు. అప్పుడు కౌశిక్.. ‘మాములుగా లేదురా.. మొన్న ఒక పెద్దాయనకు నోబల్ ప్రైజ్ వస్తే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తే రెండే లైక్‌లు వచ్చాయి. అదే ఒక ఆవిడ చపాతి గుండ్రంగా వచ్చిందని పోస్ట్ పెడితే 14 వేల లైకులు వచ్చాయి. అందులో నాది కూడా ఒకటి ఉంది’ అని అంటాడు. దానికి తేజ.. నువ్వేందుకు కొట్టావు అన్న అని అడగ్గా.. పెట్టింది మా ఆవిడే కదా అని సమాధానం చెప్తాడు. అయితే కౌశిక్ నిజంగానే భార్య గుట్టు బయట పెట్టాడా..?, షో కోసం కేవలం అలా డైలాడ్ చెప్పాడో తెలియదు గానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ మాత్రం అలానే ఉంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp