Kota Srinivasa Rao : మహేశ్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై యాక్టర్ కోట శ్రీనివాసరావు సంచలన కామెంట్స్
Kota Srinivasa Rao : క్యారెక్టర్ ఆర్టిస్టు కోటా శ్రీనివాస్ రావు తెలుగు ప్రేక్షకులు సుపరిచితులే. ఈయన తన సినీ జీవితంలో వందల సినిమాల్లో నటించారు.ఒకప్పుడు ప్రతినాయకుడి పాత్రలు పోషించిన ఆయన కాలక్రమేణా కమెడియన్ పాత్రలు కూడా చేసేందుకు సిద్ధమయ్యారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరు నటులతో కలిసి సినిమాలు చేశారు.
Kota Srinivasa Rao : వయస్సు మీద పడిన ఆ కోరిక చావలేదు
ప్రస్తుతం కోట శ్రీనివాస్ రావు వయోభారంతో ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ సినీ అవకాశాలు వస్తే నేటికీ సినిమాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కోట చెబుతున్నారు.తనకు సినిమాలంటే చాలా ఇష్టం అని.. తన జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే సినిమా లైఫ్ తప్పా వేరేది కనిపించదని పేర్కొన్నారు. వయస్సు మీద పడిన తనకు సినిమాలు చేయాలని అనిపిస్తుందని.. కానీ అవకాశాలు రావడం లేదని పేర్కొన్నారు. అందుకే ఈ మధ్య ఆయన యూట్యూబ్ చానెళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తన జీవితంలో జరిగిన అనుభవాలతో పాటు ఇతర యాక్టర్లు..
యంగ్ అండ్ ఓల్డ్ నటుల గురించి పలు ఆసక్తి కరమైన విషయాలను వెల్లడిస్తుంటారు. తాజాగా ఆయన ఓ ఇంటర్య్యూలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, నందమూరి తారకరామారావుపై సంచలన కామెంట్స్ చేశారు. ఆ మధ్యలో ఒకసారి ఒక ఈవెంట్‌లో మహేశ్ బాబు కనిపించగా తనకు సినిమాల్లో నటించాలని ఇంకా ఉందని ఏదైనా అవకాశం ఉంటే ఇప్పించాలని కోరగా.. మీకు నేను అవకాశాలు ఇప్పించడం ఏంటని అడిగారని అన్నారు. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా మీరు సీనియర్ నటులు. మీకు నేను అవకాశం ఇప్పించడం బాగోదని చెప్పినట్టు వివరించారు. ప్రస్తుతం ఈ టాలీవుడ్ సూపర్ స్టార్స్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.