Home » Entertainment » Actor Nani Comments On Ap Govt Regarding Discounting Movie Ticket Prices
Entertainment

Actor Nani : థియేటర్ కంటే కిరాణా దుకాణం నయమంటూ.. ఏపీ ప్రభుత్వ తీరుపై హీరో నాని ఊహించని వ్యాఖ్యలు..!

Authored By
Inesh A
The Telugu News | Updated on: December 23, 2021 2:39 pm
Advertisement

Actor Nani : సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తీరుపై హీరో నాని ఊహించని వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ రేటును తగ్గించడం కారణంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు.. ఓ కిరణా షాపుకు వచ్చిన కనీస ఆదాయం కూడా రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. టికెట్ల ధరల విషయంలో ఎవరూ కోరకపోయిన వాటిని తగ్గించి సినీ ప్రేక్షకులను ఏపీ ప్రభుత్వం అవమానించిందన్నారు.

Advertisement

ఈ అంశంపై ఇప్పుడు తను ఏది మాట్లాడినా వివాదమే అవుతుందంటూ… తప్పని సరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తోందన్నారు. టికెట్ రేట్ల విషయంలో ప్రేక్షకులకు లేని అభ్యంతరం వారికి ఏమిటో అర్థం కావడం లేదంటూ ఈ అంశంలో ఏపీ ప్రభుత్వ తీరు సరిగా లేదని అభిప్రాయపడ్డారు. గత కొంతకాలంగా టిక్కెట్ ధరలకు సంబంధించి ఏపీ ప్రభుత్వ జారీ చేసిన జీవోపై టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ఏకంగా నేల టికెట్ రేటును రూ. 5 గా నిర్ణయించడంతో.. నష్టాలు తప్పవని కొన్ని థియేటర్లను యాజమాన్యాలు స్వచ్ఛందంగా మూసి వేస్తున్నాయి.

actor nani comments on ap govt regarding discounting movie ticket prices

Advertisement

ఈ కారణంగా ప్రభుత్వ తీరుని ఉద్దేశించి నాని చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత రెట్టింపు చేసేలా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల గురించి పవన్ కల్యాణ్ ఫైర్ అయినప్పుడు ఆయనకు నానీ మద్దతుగా మాట్లాడారు. ఆయన నటించిన శ్యామ్ సింగ రాయ్ రేపు అవ్వనుండగా ఆ చిత్ర ప్రమోషన్ లో భాగంగా మీడియాతో నాని ఈ వ్యాఖ్యలు చేశారు.

Inesh A

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి