Actor Suhas : పుష్ప సినిమాలో నాకు చాన్స్ రాకపోవడానికి కారణం అదే... సుకుమార్ గారు అలా చేశారంటే నమ్మలేకపోయా...!
Actor Suhas : కలర్ ఫోటో సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్న హీరో సుహాస్ తాజాగా ప్రసన్న వదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సస్పెన్స్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు అర్జున్ వై కే దర్శకత్వం వహించారు. అయితే ఇక్కడ దర్శకుడు అర్జున్ మన లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యుడు కావడం గమనార్హం. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే సుకుమార్ వద్ద పనిచేసినటువంటి చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఇప్పుడు డైరెక్టర్లుగా మారి తొలి సినిమాలతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అర్జున్ వై కె కూడా ప్రసన్నవదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మే 3న సినిమా విడుదల చేసేందుకు సినీ బృందం డేట్ కూడా కరార్ చేసింది. ఇక సినిమా విడుదల డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ ని కూడా మొదలుపెట్టారు. అంతేకాక ఇటీవల విడుదలైన ప్రసన్నవదనం ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి హైప్ వచ్చిందని చెప్పాలి. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సుకుమార్ కూడా పాల్గొని తన శిష్యుడు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రసన్నవదనం మూవీ టీమ్ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. దీనిలో భాగంగానే హీరో సుహాస్ మాట్లాడుతూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సుకుమార్ గారు ముఖ్య అతిథిగా రావడం చాలా బాగా అనిపించింది అని తెలియజేశారు.
Actor Suhas : పుష్ప సినిమాలో నాకు చాన్స్ రాకపోవడానికి కారణం అదే… సుకుమార్ గారు అలా చేశారంటే నమ్మలేకపోయా…!
అంతేకాక కార్యక్రమంలో సుకుమార్ గారు నా గురించి మాట్లాడుతూ నాపై చూపిన గౌరవానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే డైరెక్టర్ అర్జున్ కూడా మాట్లాడుతూ సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినప్పుడు ఆయన దగ్గర నుండి నేను చాలా నేర్చుకున్నానని , మరి ముఖ్యంగా చాలా ఓపిగ్గా ఉండటం ఆయన దగ్గరే నేర్చుకున్నట్లుగా తెలిపారు. అయితే ఆ సమయంలో నాకు పెద్దగా అర్థం అయ్యేది కాదు కానీ ఇప్పుడు నేను డైరెక్టర్ అయ్యాక సుకుమార్ గారు అప్పుడు అలా ఎందుకు ఉన్నారనేది ఇప్పుడు బాగా అర్థమవుతుందంటూ తెలిపారు. ఈ విధంగా ఫన్నీ ఫన్నీ కామెంట్స్ తో ఆసక్తికరమైన విషయాలతో ప్రసన్నవదనం మూవీ టీమ్ చిట్ చాట్ అద్భుతంగా జరిగింది.
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
This website uses cookies.