Sreemukhi : శ్రీముఖి అలాంటిది..! అసలు విషయం చెప్పిన సీరియల్ నటి
Sreemukhi : బుల్లితెరపై శ్రీముఖి ఒకప్పుడు ఫుల్ ఫేమస్. క్షణం తీరిక లేకుండా బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ చేస్తూనే వచ్చింది. అయితే బిగ్ బాస్ షో మాత్రం శ్రీముఖి ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసింది. బిగ్ బాస్ కంటే ముందుగా పటాస్ అనే షోతో క్రేజ్ తెచ్చుకుంది. అందులో వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా చాలా ఎక్కువే ఉండేవి. శ్రీముఖి అలాంటి డైలాగ్స్‌తో దుమ్ములేపేది. అయితే బిగ్ బాస్ షో తరువాత తాను మంచి కాన్సెప్ట్ ఉన్న షోలను మాత్రమే చేస్తాను అని చెప్పింది.
కానీ బిగ్ బాస్ ఇంట్లో శ్రీముఖి ఆడిన తీరుకు ఎక్కువ నెగెటివిటీ పెరిగింది. అలా శ్రీముఖి చేసిన షోలు ఫ్లాప్ అవుతూనే వచ్చాయి. స్టార్ట్ మ్యూజిక్ అంటూ కొత్త షోను శ్రీముఖి చేత ప్రారంభించారు. కానీ అది వర్కవుట్ అవ్వలేదు. ఆ తరువాత బొమ్మ అదిరింది షోకు హోస్ట్‌గా వచ్చింది. అది మొత్తానికే కనిపించకుండా పోయింది. ఇక ఇప్పుడ కామెడీ స్టార్స్ అంటూ రచ్చ చేస్తోంది. ఇది కాకుండా పండుగ స్పెషల్ ఈవెంట్లకు శ్రీముఖి హోస్టింగ్ చేస్తుంటుంది.
Sreemukhi : శ్రీముఖి వజ్రంలాంటిది..
అలా పండుగ ఈవెంట్లలో సీరియల్ నటీనటులతో శ్రీముఖి ఇంటరాక్ట్ అవుతుంటుంది. ఈ క్రమంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నటి ఐశ్వర్య కామెంట్ చేసింది. శ్రీముఖితో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించింది. ఈ ప్రపంచంలో ఎంతో బలమైన అమ్మాయిల్లో ఆమె కూడా ఒకరు. నా జీవితానికి ఆమె స్ఫూర్తి. నా క్వీన్. ఆమె ఓ పోరాట యోధురాలు. ఆమె గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. లవ్యూ శ్రీ అక్క.. నువ్ డైమండ్ లాంటిదానివి. ఎందుకంటే వాటిని ఎవ్వరూ పగలగొట్టలేరు కదా? అని చెప్పుకొచ్చింది.