Amaravathiki Aahwanam Movie Review : అమరావతికి ఆహ్వానం మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 12 February 2026, 11:00 pm
  •  Amaravathiki Aahwanam Movie Review : అమరావతికి ఆహ్వానం మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

ధన్య బాలకృష్ణ, Dhania Balakrishna ,, Ester Noronha ఎస్తర్ నోరోన్హా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’ విడుదలకు సిద్ధమవుతోంది. జీవీకే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివ కంఠమనేని, సుప్రిత Supritha  , హరీష్ Harish , Ashok Kumar  అశోక్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వర రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో “కీటక మరణం కప్ప జీవనాధారం… కప్ప మరణం పాము జీవనాధారం… ఈ సృష్టి మొత్తం జనన–మరణ పోరాటం” అనే డైలాగ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించగా, ఇటీవ‌ల విడుదలైన టీజర్ మాత్రం డైలాగ్స్ లేకుండానే భయానక వాతావరణాన్ని సృష్టించింది.

Amaravathiki Aahwanam Movie Review : అమరావతికి ఆహ్వానం మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

Amaravathiki Aahwanam Movie Review : అమరావతికి ఆహ్వానం మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

Amaravathiki Aahwanam Movie Review : సస్పెన్స్, థ్రిల్లింగ్ విజువల్స్

సస్పెన్స్, థ్రిల్లింగ్ విజువల్స్, డార్క్ టోన్‌లతో కట్ చేసిన టీజర్ సినిమా జానర్‌ను స్పష్టంగా చూపిస్తూ హారర్ ఎలిమెంట్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తోంది. ప్రత్యేకంగా పద్మనాబ్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్‌లో మ్యూజిక్ టెన్షన్‌ను పెంచుతూ సీన్లను మరింత ఇంపాక్ట్‌ఫుల్‌గా మార్చింది. విజువల్స్ కూడా డార్క్ షేడ్స్‌తో మిస్టీరియస్ ఫీలింగ్‌ను కలిగించాయి. తక్కువ సమయంలోనే కథ ఏదో పెద్ద సీక్రెట్ చుట్టూ తిరుగుతుందనే హింట్ ఇవ్వడం టీజర్ ప్రత్యేకతగా నిలిచింది.టీజర్‌ను ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ లాంచ్ చేయగా, దర్శకుడు జీవీకే ఈ చిత్రం బలమైన కంటెంట్‌తో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. టీజర్‌లో కనిపించిన సన్నివేశాలు దర్శకుడి టాలెంట్‌ను ప్రతిబింబిస్తున్నాయని, హారర్ జానర్‌లో మంచి హిట్ అవుతుందని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు.

తెలుగు ప్రేక్షకులు హారర్–థ్రిల్లర్ సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ ‘అమరావతికి ఆహ్వానం’ భయపెట్టే కథతో, సస్పెన్స్ నిండిన ట్రీట్ ఇవ్వబోతుందనే సంకేతాలు టీజర్ స్పష్టంగా ఇస్తోంది. మొత్తంగా టీజర్ చూస్తే ఈ సినిమా హారర్ ఎలిమెంట్స్‌తో పాటు మిస్టరీ, థ్రిల్లింగ్ మోమెంట్స్‌ను కలిపిన ప్యాకేజీగా ప్రేక్షకుల ముందుకు రానుందనే అంచనాలు పెరిగాయి. లైట్‌ హౌస్‌ సినీ మ్యాజిక్‌ బేనర్‌పై కేఎస్‌ శంకర్‌రావు, ఆర్‌ వెంకటేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

క‌థ‌:

ఒక ఊరిలో ఈశ్వ‌ర్ ( శివ కంఠ‌మ‌నేని), ఈయ‌న స‌స్పెండ్ అయిన పోలీస్ ఆఫీస‌ర్ కాగా, ఈయ‌న‌తో పాటు భార్య భాను ( ధన్య బాల‌కృష్ణ‌), ఇద్ద‌రు మర‌ద‌ళ్ల‌తో క‌లిసి హైద‌రాబాద్‌లో నివ‌సిస్తూ ఉంటాడు. అయితే మ‌ర‌ద‌లు భార్గ‌వి ( సుప్రిత‌) సిటీలోని బూత్ బంగ్లాలో ఒక‌రోజు గ‌డిపి ద‌య్యం వంటివి లేద‌ని నిరూపిస్తుంది. అయితే ఓ వ్య‌క్తి భార్గ‌వికి ఫోన్ చేసి ఓ చోట నిజంగా దెయ్యాలు ఉన్నాయంటూ అమ‌రావ‌తికి ఆహ్వానిస్తాడు. అయితే దానిని ఓ ట్రిప్‌లా భావించి భార్గ‌వితో పాటు ఫ్యామిలీ కూడా అక్క‌డికి వెళుతుంది.మ‌రి అమరావ‌తికి వెళ్లాక అక్క‌డ నిజంగా దెయ్యాలు ఎదుర‌య్యాయా? ఈశ్వ‌ర్ వాళ్ల‌కి ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? అక్క‌డ ర‌హ‌స్యాలు ఏంటి? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

విశ్లేష‌ణ‌:

అమ‌రావ‌తికి ఆహ్వానం అనే చిత్రం స‌రికొత్త క‌థతో,క‌ట్టిప‌డే స‌న్నివేశాల‌తో ఇంట్రెస్టింగ్‌గానే సాగింది. అమ‌రావ‌తి ఊరికి మ‌ద్యం మ‌త్తులో న‌లుగురు స్నేహితులు వెళ్ల‌డం, అక్క‌డ ఓ స్నేహితుడు వింత‌గా ప్ర‌వ‌ర్తించ‌డం, ఆ త‌ర్వాత త‌న‌ను తాను చంపుకునే సీన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.ఓపెనింగ్ సీన్స్ కాస్త నిదానంగా ఉన్నా, క‌థ ముందుకు సాగుతున్న కొద్ది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇక అమ‌రావతికి ప్ర‌యాణం మొదలైన త‌ర్వాత క‌థ‌లో వేగం పెరుగుతుంది. హ‌రర్ సీన్స్ మెప్పిస్తాయి. పెద్ద గెస్ట్ హౌజ్‌కి వెళ్ల‌డం, అనుకోని ప‌రిస్థితులు ఎదురు కావ‌డం అనేది బాగుంది.

ఈశ్వ‌ర్, రాజేశ్వ‌రి పాత్ర‌ల మ‌ధ్య గ‌తంలో ఏం జ‌రిగింది అనే ఇంట్రెస్ట్‌ని క‌లిగిస్తూ సెకండ్ హాఫ్‌ని అద్భుతంగా న‌డిపించారు. కొన్ని సీన్స్ ఆక‌ట్టుకుంటాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఎమోష‌న్స్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయి. సెకండాఫ్ లో హార‌ర్ డోస్ పెంచితే అవుట్ పుట్ ఇంకా బాగా వ‌ర్క‌వుట్ అయ్యేది. ఇక ద‌ర్శ‌కుడు జీవీకే హార‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌కి త‌గ్గ‌ట్టుగా సెట‌ప్ బాగా చేశాడు. ఫ‌స్ట్ హాఫ్‌లో కామెడీ బాగా పేల‌లేదు. సెకండాఫ్‌లో హార‌ర్ ఎలిమెంట్స్ ఇంకా ఉంటే బాగుండేది. సినిమాకి కెమెరా వ‌ర్క్, మ్యూజిక్ కీల‌కం. సాయి బాబు త‌లారి ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp