Home » Entertainment » Actress Hari Teja About Winning And Losing
Entertainment

Hari teja : అలాంటి మాటలు ఎందుకు అంటోంది.. అనుమానాలు రేకెత్తిస్తోన్న హరితేజ పోస్ట్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: November 2, 2021, 7:15 am
Advertisement

Hari teja  బుల్లితెరపై హరితేజ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోలో హరితేజ అందరినీ ఎంటర్టైన్ చేసింది. బిగ్ బాస్ షో కంటే ముందుగా సీరియల్స్‌తో బుల్లితెర ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. అయితే అప్పుడు కేవలం విలన్ పాత్రలను ధరిస్తూ అందరినీ భయపెట్టేసింది. కానీ బిగ్ బాస్ తరువాత హరితేజ కెరీర్ మొత్తం మారిపోయింది. తనలోని కామెడీ యాంగిల్‌ను బయటకు తీసింది.

Advertisement

Actress Hari teja About Winning And Losing

అలా హరితేజ ఎక్కువగా కామెడీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఎన్నో సినిమాల్లో ఆఫర్లు కొట్టేసింది. అందరినీ నవ్వించింది. ఇక సోషల్ మీడియాలో అయితే హరితేజ ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది. పాటలు పాడుతూ, అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. తాజాగా హరితేజ ఓ పోస్ట్ చేసింది. అందులో కొన్ని కొటేషన్లు చెప్పింది.

Advertisement

Hari teja  ఓటమిపై హరితేజ..

Actress Hari teja About Winning And Losing

గెలిస్తే ఏముంటుంది.. చప్పట్లు తప్పా. ఒక్కసారి ఓడిచూడు.. ఈ ప్రపంచం ఏంటో తెలుస్తుంది అని రాసుకొచ్చింది హరితేజ. అయితే ఇప్పుడు ఆ మాటలు ఎందుకు మాట్లాడింది.. ఆ కొటేషన్ ఎందుకు షేర్ చేసిందా? అని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ గురించి హరితేజ ఏమైనా కామెంట్ చేసి ఉంటుందా? అని నెటిజన్లు అనుమాన పడుతున్నారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి